మద్యం తాగే మహిళలకు ఇది శుభవార్త

సమాజం మారింది. ఇన్నాళ్లు పురుషులే మందు కొట్టేవారు.. కానీ ఇప్పుడు మహిళలు పంచుకుంటున్నారు. జీవితంలో సగభాగం అయిన మహిళలు అన్నింట్లోనూ రాణిస్తున్నారు. మందులో కూడా మగువలు ఎందుకు తక్కువ అవుతారు. అందుకే మద్యం తాగడం లో కూడా మహిళల వాటా పెరిగి పోతోంది. గ్రామాల్లో తక్కువగా ఉన్నా ఇప్పుడు సిటీలో మహిళలు మద్యం తాగడం చాలా కామన్. ఢిగ్రీ చదువుతున్న అమ్మాయిలే బీర్లు కొడుతున్నారు. ఇప్పుడదో ఫ్యాషన్ గా మారింది.

అయితే మద్యం తాగడం వరకూ ఓకే. మరి ఆ మందు ఎలా తేవాలి. వైన్స్ బార్లలో పురుష మందు బాబులు క్యూల్లో ఉంటారు. అక్కడికెళ్లి మందు తీసుకుంటే ఇంకా ఏమైనా ఉందా? పైగా ఆడవారు వైన్స్ షాపుల్లో మద్యం తీసుకునేంత ధైర్యం చేయరు. అందరూ వింతగా చూస్తారు. ఏదైనా కూడా చేస్తారు. అందుకే మగువులకు ఈ మందు కష్టాలు తీర్చడానికి మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని కమలనాథ్ సర్కారు ముందుకొచ్చింది. వారి మందు కష్టాలను తీర్చింది.

మహిళలు మందు కొనేందుకు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు వారికోసం ప్రత్యేకంగా మద్యం షాపులను ఏర్పాటు చేయాలని మధ్యప్రదేశ్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ‘ఉమెన్ ఫ్రెండ్లీ లిక్కర్ షాపు’ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో కేవలం లేడీస్ మాత్రమే మద్యం కొనాలే ఏర్పాటు చేసింది. ఇందులో ప్రముఖ ఫారిన్ బ్రాండ్లు మాత్రమే దొరుకుతాయట..

ఈ మహిళల వైన్స్ షాపుల ద్వారా రూ.2వేల కోట్ల ఆదాయాన్ని రాబట్టేందుకు ఎంపీ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఇలా మహిళల మద్యం కష్టాలను తీర్చడంతోపాటు లాభాలను ఎంపీ సర్కారు వెనకేసుకుంటోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *