మళ్లీ సమంత ఫ్రెగ్నెన్సీ రూమర్స్!!

ఏ మాయా చేసావే` (2009) చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది సమంత. మొదటి సినిమాతోనే అక్కినేని బుల్లోడితో స్నేహం కుదిరింది. చైతన్యతో ప్రేమదోబూచులాట మొదలైంది ఆ సినిమాతోనే. ఆ క్రమంలోనే ఆఫ్ ద స్క్రీన్.. ఆన్ ద స్క్రీన్ రొమాన్స్ వర్కవుటైంది. ఐదేళ్ల తరువాత `ఆటోనగర్ సూర్య`లో నటించేప్పటికి ఇద్దరి మధ్యా బంధం మరింత బలపడింది. 2017 అక్టోబర్ లో గోవాలో హిందూ – క్రైస్తవ సంప్రదాయాల్లో చైతన్య- సమంత పెళ్లి జరిగింది. ఆ తర్వాత ఈ జంట జర్నీ గురించి తెలిసిందే. ఇటీవలే `ది ఫ్యామిలీ మ్యాన్` రెండవ సీజన్ చిత్రీకరణలో పాల్గొన్న సమంత `జాను` రిలీజ్ ప్రమోషన్స్ లోనూ సందడి చేసింది.

అయితే ప్రతిసారీ సమంతకు ఎదురయ్యే ప్రశ్న ఒక్కటే. పిల్లల్ని ఎప్పుడు కంటారు? అన్నది కామన్ అయిపోయింది. చైతన్యను పెళ్లాడక ముందు ప్రతిసారీ పెళ్లెప్పుడు? అంటూ మీడియా విసిగించేది. ఇప్పుడు పిల్లల్ని కనేదెప్పుడు? అంటూ ప్రశ్నించి విసిగిస్తోంది. ఇక ఇంటా బయటా ఇదే ప్రశ్న రిపీటైపోతుండడంతో సామ్ కాస్తంత అసహనం వ్యక్తం చేస్తోంది. నవ్వుతూనే సమాధానం ఇస్తున్నా.. పదే పదే ఇదే ప్రశ్న రిపీటవుతుండడం తనకు ఇబ్బందికరంగానే మారింది. కొందరు అడ్వాన్స్ డ్ గా ఊహించేస్తూ సామ్ ఫ్రెగ్నెంట్ అంటూ రూమర్లు క్రియేట్ చేస్తుండడంతో `మీరు కనిపెట్టేస్తే మాకు చెప్పండి` అంటూ సమంత గట్టిగానే రెస్పాండ్ అవుతోంది.

ప్రస్తుతం విజయ్ సేతుపతి- నయనతార ప్రధాన పాత్రల్లో విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్న `కాతు వాకులా రేండు కదల్` చిత్రానికి సమంత సంతకం చేసింది. ఈ సినిమా పూర్తయ్యాక.. కొంతకాలం పూర్తిగా ఫ్యామిలీ లైఫ్ కే కేటాయించాలని సమంత నిర్ణయించుకొందట. ఆ మేరకు కోలీవుడ్ మీడియాలో విపరీతంగా ప్రచారం అయిపోతోంది. ఈ విరామం పిల్లల్ని కనేందుకే.. అటుపై ఇక పూర్తిగా ఇంటికే పరిమితమవుతుంది అన్న ప్రచారం సాగుతోంది. ఏడాది కాలంగా ఇవే పుకార్లు రిపీటవుతూనే ఉన్నాయి. ఇలాంటి పుకార్లు వచ్చినప్పుడు.. “డామ్న్ .. మీరు కనుగొంటే దయచేసి మాకు తెలియజేయండి“ అంటూ నవ్వేస్తోంది. 96 రీమేక్ గా వచ్చిన జాను విషయంలో ఆశించినది ఒకటి అయితే దక్కినది ఇంకొకటి. దీంతో సామ్ ప్రస్తుతం నిరాశలో ఉంది. ఇలాంటి టైమ్ లో మళ్లీ ఫ్రెగ్నెన్సీ అంటూ ఇర్రిటేట్ చేస్తే ఇంకెలా రియాక్టవుతుందో!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *