మాజీ సీఎం తనయుడి పెళ్లి రద్దు?

లక్షమంది అతిథులతో భారీ ఎత్తున తన తనయుడి పెళ్లిని చేయాలని భావించారట కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి. బెంగళూరు-రామనగర మధ్య ప్రాంతంలో ఒక భారీ కల్యాణ వేదికను చూసి.. అక్కడ సామాన్యులు అసామాన్యుల మధ్యన భారీ ఎత్తున నిఖిల్ గౌడ పెళ్లి చేయాలని ఆయన తండ్రి కుమారస్వామి భావించారు.

ఇప్పటికే ఎంగేజ్ మెంట్ జరిగింది. ఈ నేపథ్యంలో త్వరలోనే పెళ్లి కూడా జరగాల్సి ఉంది. దానికి అతిరథమహారథులను ఆహ్వానించడం కుమారస్వామికి పెద్ద కష్టం ఏమీ కాదు.

అలాగే పార్టీ క్యాడర్ ను కూడా పెళ్లికి పిలిచి ఘనంగా వేడుక నిర్వహించాలని కుమారస్వామి భావించారు.
అయితే ఇప్పుడు కరోనా భయాల నేపథ్యంలో ఆ వివాహ వేడుక నిర్వహణ ప్రశ్నార్థకంగా మారినట్టుగా సమాచారం.

పెళ్లి విషయంలో పునరాలోచన చేస్తున్నారట కుమారస్వామి. ప్రస్తుత పరిస్థితుల్లో లక్ష మందికి పైగా ఒక చోటకు అంటే.. లేని పోని భయాలకు ఆస్కారం ఏర్పడవచ్చు. అందునా కర్ణాటకలో కరోనా జాడలను గుర్తించారు.

కొన్ని కేసులు రిజస్టర్ అయ్యాయి. రెండు కరోనా మరణాలు కూడా నమోదు అయినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇక క్రికెట్ మ్యాచ్ లు కాస్త జనసమూహం ఏర్పడే ప్రోగ్రామ్స్ అన్నీ రద్దు అవుతున్న సంగతీ తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో ఈ భారీ పెళ్లి వేడుక నిర్వహణ కష్టం కావొచ్చు. అందుకే ఈ విషయంలో పునరాలోచిస్తున్నారట కుమారస్వామి. రెండు మూడు రోజుల్లో ఈ విషయం గురించి ప్రకటన చేయనుందట జేడీఎస్ ఫస్ట్ ఫ్యామిలీ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *