మారుతీరావు ఆత్మహత్య

కూతురు అమృత భర్త ప్రణయ్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న మారుతీరావు నిన్న రాత్రి ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్‌… చింతల్‌బస్తీలోని ఆర్యవైశ్య భవన్‌లో ఆయన విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసుల వేధింపుల వల్లే ఆయన ఆత్మ హత్య చేసుకున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కూతురు అమృతను ప్రేమ పెళ్లి చేసుకున్న ప్రణయ్‌ని హత్య చేయించినట్లు మారుతీ రావుపై ఆరోపణలు ఉన్నాయి. మారుతీరావు స్వస్థలం… నల్గొండ జిల్లా… మిర్యాల గూడ. గతంలో తన కూతుర్ని పెళ్లి చేసుకున్న అల్లుడు ప్రణయ్‌ని కిరాయి హంతకులతో మారుతీరావు హత్య చేయించాడు. ఈ కేసులో ఆయన బెయిల్‌పై బయట ఉన్నాడు. ఆ తర్వాత ఇటీవలే కూతురి ఫిర్యాదుతో ఆయన్ని మళ్లీ అరెస్టు చేసి రిమాండ్‌కి తరలించారు. తర్వాత బెయిల్ పై విడుదల చేశారు.
ప్రణయ్ హత్య కేసులో అనుకూలంగా సాక్షం చెబితే ఆస్తి తన పేరున రాస్తానని మధ్య వర్తులతో మారుతీరావు… అమృతకు రాయబారం పంపినట్లు తెలిసింది. పీడీ యాక్ట్ కేసులో ఆరు నెలల కిందట విడుదలైన మారుతీరావు… అప్పటి నుంచి కూతురు అమృతను వేధిస్తున్నట్లు తెలిసింది. అమృత ఫిర్యాదుతో మారుతీరావును ఇటీవల అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు మిర్యాలగూడ పోలీసులు. ఆ తర్వాత మళ్లీ బెయిల్ పై విడుదలయ్యారు. కూతురు దూరమైందని తీవ్ర మనస్తాపం చెందిన మారుతీరావు… అందుకే ఆత్మహత్య చేసుకున్నారా అన్నది తేలాల్సి ఉంది. మరోవైపు… ఆత్మహత్యకు కారణం పోలీసుల వేధింపులే అన్న అనుమానాలు కూడా ఉన్నాయి.

2018 సెప్టెంబర్ 14న నల్గొండ జిల్లా… మిర్యాలగూడలో ప్రణయ్ హత్య జరిగింది. భార్య అమృతతోపాటు ఆస్పత్రికి వెళ్లి వస్తుండగా… ఆస్పత్రి బయటే 24 ఏళ్ల ప్రణయ్‌ని కత్తులతో నరికి చంపారు. అమృత తండ్రి తిరునగరి మారుతీరావు… హంతకులకు సుపారి ఇచ్చి ప్రణయ్‌ని హత్య చేయించారు. ఈ కేసులో మారుతీరావు 7 నెలలుగా వరంగల్‌ సెంట్రల్‌ జైలులో ఉన్నారు. అనంతరం గత ఏడాది ఏప్రిల్‌లో బెయిల్‌పై విడుదల బయట తిరుగుతున్నారు. ఇప్పుడు ఆయన ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది.

వారం కిందట నల్గొండ జిల్లా… మిర్యాలగూడలో ఓ శవం కలకలం రేపింది. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ప్రణయ్ హత్య కేసు నిందితుడు మారుతీరావు షెడ్డులో ఆ కుళ్లిన శవం కనిపించింది. షెడ్డు నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు శనివారం పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి వెళ్లి చూశారు. ఏ మాత్రం గుర్తు పట్టరానికి వీల్లేకుండా కుళ్లిపోయిన స్థితిలో ఉంది ఆ శవం. అది మగ మనిషి మృతదేహమనీ… మృతుడి వయసు 30-40 ఏళ్ల వరకు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఓ వారం, పది రోజుల కిందటే చంపి ఉండొచ్చని అనుకుంటున్నారు. పోలీసుల ముందు ఇప్పుడు ఎన్నో ప్రశ్నలు. చనిపోయిందెవరు? చంపిందెవరు? ఎప్పుడు, ఎలా… ఇలా చాలా ప్రశ్నలు. ఆధారాలుగా ఏమన్నాయంటే… ఆ షెడ్డు… మిర్యాలగూడలోని అద్దంకి-నార్కట్‌పల్లి హైవే దగ్గరున్న రిలయన్స్‌ పెట్రోల్‌ బంక్‌ ముందు… మారుతీరావుకు ఖాళీ షెడ్డు ఉంది. అది ఆధారం కాకపోయినా… అది శవం ఉన్న ప్రాంతంగా చెప్పుకోవచ్చు. మృతదేహంపై ఆయిల్‌ పోసి ఉంది. మృతుడి ఒంటిపై బ్లూ కలర్ షర్ట్, జీన్స్‌ ప్యాంట్స్, చేతికి వాచ్ ఉన్నాయి. ముఖం పూర్తిగా కుళ్లిపోయి ఉంది. ఇది ఎవరో కావాలని చేసిన హత్య అనుకోవచ్చు. మారుతీరావును ఇరికించే ఉద్దేశంతో డెడ్ బాడీని షెడ్డులో పడేశారని అనుకోవచ్చు. లేదంటే… ఆ షెడ్డు ఎలాగూ పాతదే కదా అనే ఉద్దేశంతో అక్కడ మర్డర్ చేసి ఉండొచ్చు. ఒకవేళ రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వ్యక్తిని షెడ్డులో పడేసి పోయారా అన్నది మరో డౌట్. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నా్రు. ఇక ఫోరెన్సిక్ టీమ్… ఆల్రెడీ ఆధారాలు సేకరించింది. వేలిముద్రలు సంపాదించింది. శవం ఎవరో తెలియకపోవడం సమస్యగా మారింది.

మారుతీరావు… తనకు ఉన్న ఖాళీ ప్లేస్‌లో హోటల్ నిర్మిద్దామనుకొని… షెడ్డును నిర్మించారు. పదేళ్ల కిందట ఇక్కడ ఫ్లైఓవర్ నిర్మాణం మొదలైంది. దాంతో రోజంతా దుమ్ము, ధూళి వస్తుంటే… హోటల్ ఆలోచన వాయిదా వేశారు. దాంతో షెడ్డు అలా ఒంటరిగా మిగిలింది. కాలక్రమంలో అది తుప్పు పట్టింది. అది ఇప్పుడు ఓ శవానికి కేంద్రమైంది. పోలీసులు ఏం తేలుస్తారన్నది స్థానికులకు ఆసక్తిగా మారింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *