మార్చి 17 నుండి 26వరకు అండమాన్ లో టూరిజం బంద్

అండమాన్‌లో టూరిజం బంద్… దేశవ్యాప్తంగా కరోనా కేసులు ప్రబలుతుండటంతో అన్ని రాష్ట్రాలూ అప్రమత్తమై వైరస్‌ నిరోధానికి పలు చర్యలు చేపడుతున్నాయి. కరోనాను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించగా పలు రాష్ట్రాలు ఈ నెలాఖరు వరకూ విద్యా, వాణిజ్య సంస్థలు, థియేటర్లు, మాల్స్‌ను మూసివేయాలని నిర్ణయించాయి.

ఇక వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు అండమాన్‌ నికోబార్‌ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఈనెల 17 నుంచి 26 వరకూ టూరిజం కార్యకలాపాలను నిలిపివేయాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. ఈ పదిరోజులు అండమాన్‌ దీవులను సందర్శించే ప్రణాళికలను వాయిదా వేసుకోవాలని పర్యాటకులను కోరింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *