మీటూ తనూశ్రీ దత్తా బాలీవుడ్ లో ఎంటర్ అయ్యింది

హాలీవుడ్ కే పరిమితం అయిన మీటూ తనూశ్రీ దత్తా ఎపిసోడ్ తో బాలీవుడ్ లో ఎంటర్ అయ్యింది. బాలీవుడ్ లో ఎంత మంది మీటూ ఆరోపణలు ఎదుర్కొన్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రముఖ స్టార్స్ కూడా మీటూ ఆరోపణల కారణంగా సినిమాల ఛాన్స్ లు పోగొట్టుకున్నారు. పలువురు హీరోయిన్స్ మీటూ అంటూ ఎప్పటి విషయాలనో చెప్పుకొచ్చారు. పది.. ఇరవై ఏళ్ల క్రితం జరిగిన విషయాలు.. లైంగిక వేదింపులు ఇప్పుడు మీడియా ముందుకు రావడంతో పలువురి పరువు పోయింది.

గత ఏడాది అంతా కూడా మీటూ హడావుడి కనిపించింది. మీటూ కారణంగా ప్రస్తుతం బాలీవుడ్ తో పాటు ఇతర సినీ పరిశ్రమల్లో కూడా కాస్టింగ్ కౌచ్ తగ్గిందని చెప్పుకోవచ్చు. హీరోయిన్ గా ఛాన్స్ కావాలంటే గతంలో ప్రొడక్షన్ మేనేజర్ నుండి పలువురికి తల వంచాల్సి వచ్చేదట. కాని ఇప్పుడు అలా లేదని అవకాశం ఉంటే ఇస్తున్నా లేదంటే లేదు అని చెబుతున్నారు అంటూ ఈమద్య ఒక నటి చెప్పుకొచ్చింది.

తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ కూడా మీటూ వల్ల మంచే జరిగింది అంటూ వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మీటూ కారణంగా ఇటీవల ఇండస్ట్రీ వారు అమ్మాయిలతో వ్యవహరించే తీరు మారింది. మగాళ్ల ఆలోచన విధానం మారింది. ఇప్పుడు కాకున్నా భవిష్యత్తు లో అయిన సమస్యలు తప్పవనే భావన కలగడంతో చాలా మంది అమ్మాయిలను ఆ విధంగా అప్రోచ్ అయ్యేందుకు భయపడుతున్నారు అంటూ ఆమె అభిప్రాయం వ్యక్తం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *