మీ మాటలు నన్ను బాధించాయి..సీఎస్ లేఖపై సీఈసీ స్పందన

స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఎన్నికల సంఘం ఉద్దేశపూర్వకంగా వాయిదా వేసిందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మండిపడింది. ఈ విషయమై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఎన్నికల సంఘం కమిషనర్ కు లేఖ రాశారు.

తాము ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని.. వాయిదాను విరమించుకోండి అని కోరుతూ సీఎస్ లేఖ రాయగా దానికి ఎన్నికల సంఘం రాష్ట్ర గవర్నర్ నిమ్మగడ్డ సురేశ్ కుమార్ స్పందించారు. ఎన్నికలు యథావిధిగా జరపాలని.. రాష్ట్రంపై కరోనా ప్రభావం లేదని ఈ మేరకు రమేష్ కుమార్ కు సీఎస్ నీలం సాహ్ని లేఖ రాయగా దానికి ప్రతిస్పందనగా కమిషనర్ రమేశ్ కుమార్ ఓ ప్రకటన విడుదల చేశారు.

కరోనా వైరస్ పరిస్థితుల నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు నిర్వహించలేమని స్పష్టం చేశారు. నిబంధనలు – అధికారాలకే లోబడే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.

గతంలో మహారాష్ట్ర – పశ్చిమ బెంగాల్ – ఒడిసా రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. అయితే ఎన్నికల వాయిదా అనంతరం తనపై వచ్చిన విమర్శలు – ముఖ్యంగా వ్యక్తిగతంగా విమర్శలు – ఆరోపణలు రావడంతో తాను ఆవేదనకు గురైనట్లు తెలిపారు.

ఈ సందర్భంగా లేఖలో పలు విషయాలు తెలిపారు. గతంలో రాజ్ భవన్ లో కంటే ముందు ఆర్థిక శాఖలో ఫైనాన్స్ వ్యవహారాలు చూశానని – ఆర్థిక వ్యవహారాలపై నాకు పూర్తి అవగాహన ఉందని తెలిపారు. అయితే రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు వాయిదా వేసినట్టు కరోనా వైరస్ ప్రభావంతో మహారాష్ట్ర – పశ్చిమ బెంగాల్ – ఒడిసా రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఆపేసినట్లు వివరించారు. ఎన్నికలకు ఆర్థిక సంఘం నిధులకు లింక్ పెట్టవద్దని కోరారు.

గతంలో ఇలా ఎన్నికలు నిలిపివేసినా కేంద్రం నుంచి నిధులు వచ్చిన సందర్భాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం గోవాలో కూడా ఎన్నికలు వాయిదా వేయాలని చూస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలను – ఆరోగ్య- కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖతో మార్గదర్శకాలను పాటిస్తూ ఆంధ్రప్రదేశ్ లో స్థానికె ఎన్నికలు వాయిదా వేసినట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *