మూడు రాజధానులు మంచిదే* — పుదుచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని తాను సమర్ధిస్తున్నారని పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు పేర్కొన్నారు. తాళ్ళరేవు మండలం పరిధిలోని జార్జి పేట పంచాయతీ ఎం ఎల్ కె నగర్ ప్రభుత్వ పాఠశాలలో గురువారం ఉదయం జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద వర్గాల అభివృద్ధే ద్యేయంగా జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థిక లోటు లో ఉన్నప్పటికీ ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలకే అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్నారని అన్నారు. ప్రతి ఒక్కరికి ఉన్నత విద్యను అందించాలనే సంకల్పంతో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం, అమ్మ ఒడి పథకాలను అమలు చేస్తున్న జగన్మోహన్రెడ్డిని అభినందించారు.రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో నిజాయితీగా ప్రజలకు సేవలు అందించే అభ్యర్థులను ఎన్నుకోవాలని సూచించారు. ఓటు కి నోటు అనే సంస్కృతిని పూర్తిగా రూపుమాపాలని తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *