మూడు రాష్ట్రాల ప్రయాణికులకు చేరువలో మరో ఎయిర్‌పోర్టు

• బెంగళూరు-బీదర్-బెంగళూరు మధ్య కొత్త విమాన సర్వీసులను ప్రారంభించిన ట్రూజెట్
తెలంగాణలో హైదరాబాద్ మినహా మరో ప్రాంతంలో మూడు రాష్ట్రాల ప్రయాణికులకు చేరువలో మరో ఎయిర్పోర్టు లేదనుకునేవారికి శుభవార్త. హైదరాబాద్ మహానగరానికి 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న కర్ణాటకలోని బీదర్లో కొత్త విమానాశ్రయం అందుబాటులోకి వచ్చింది. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు విమానసేవలు విస్తరించాలన్న కేంద్ర ప్రభుత్వ ఆలోచనలో భాగంగా సేవలందించేందుకు బీదర్ ఎయిర్పోర్టు సిద్ధమైంది. బెంగళూరు వెళ్లాలనుకునే హైదరాబాద్ వాసులకు కూడా ట్రూజెట్ సర్వీసు ఉపయుక్తంగా ఉంటుంది. అలాగే బీదర్ను ఆనుకొని ఉండే సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్ వాసులకు అతి తక్కువ దూరంలో ఉంది బీదర్ ఎయిర్పోర్టు.
బెంగళూరులో ట్రూజెట్ సర్వీసు ప్రారంభించిన అనంతరం అదే విమానంలో బీదర్ వరకు ప్రయాణించారు. సీఎం యడ్యూరప్పతో పాటు మంత్రులు, బీదర్ ప్రజాప్రతినిధులు ప్రయాణం చేశారు. అనంతరం ముఖ్యమంత్రి యడ్యూరప్ప మాట్లాడుతూ బెంగళూరు విమానాశ్రయం నుంచి బీదర్కు కేవలం గంటా 40 నిమిషాల్లోనే చేరుకున్నామని, సాధారణంగా బెంగళూరు నుంచి బస్సులో బీదర్కు చేరుకోవాలంటే 12 గంటల ప్రయాణం అవుతుందని ట్రూజెట్ విమాన సర్వీసుల వల్ల ప్రయాణ దూరం భారం తగ్గిందని విమానసర్వీసుల పట్ల సీఎం యడ్యూరప్ప హర్షం వ్యక్తం చేశారు. బీదర్ పరిధిలో ఉన్న “కళ్యాణ కర్నాటక” అభివృద్ధికి ట్రూజెట్ విమాన సర్వీసులు మరింత దోహదపడతాయని ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఆకాంక్షించారు.
ఈ ఎయిర్పోర్టు నుంచి కర్ణాటక రాజధాని బెంగళూరుకు తొలి సర్వీసును హైదరాబాద్ టర్బో మేఘా ఎయిర్వేస్కు చెందిన ట్రూజెట్ ఎయిర్వేస్ ప్రారంభించింది. రోడ్డు మార్గంలో బీదర్ నుంచి బెంగళూరు వెళ్లేందుకు దాదాపు 12 గంటలు పడుతుంది. అత్యవసర పనుల మీద బెంగళూరు వెళ్లదలిచిన బీదర్ వాసులు హైదరాబాద్ వచ్చి ఇక్కడి నుంచి విమానంలో వెళ్తారు. తాజాగా బెంగళూరు-బీదర్-బెంగళూరు మధ్య ట్రూజెట్ ఎయిర్వేస్ విమాన సర్వీసు ప్రారంభించడంతో తమ ఎన్నో ఏళ్ళ కల నెరవేరిందని బీదర్ వాసుల ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
వ్యాపారపరంగానే కాదు చారిత్రక కట్టడాలు, వారసత్వసంపదపరంగా కర్ణాటక చరిత్రలో బీదర్ గొప్ప స్థానం కలిగి ఉంది. ఇండియన్ ఎయిర్ఫోర్స్కు చెందిన రెండో అతిపెద్ద శిక్షణ కేంద్రం బీదర్లో ఉంది. అత్యాధునిక జెట్ విమానాలకు సంబంధించి పైలెట్లు ఇక్కడ శిక్షణ పొందుతారు.
చారిత్రత్మకంగా ఎంతో ఖ్యాతిగాంచిన బీదర్ నుంచి ట్రూజెట్ సంస్థ విమాన సేవలు ప్రారంభించడంపై స్థానికులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. విమానరాకపోకల సమయం కూడా అనుకూలంగా ఉందని అన్నారు.
ఫ్లైట్ నెం.
ప్రారంభం గమ్యస్థానం బయల్దేరు సమయం చేరుకునే సమయం
2T625 బెంగళూరు బీదర్
11:25 am 1:05 pm
2T626 బీదర్
బెంగళూరు 1:35 pm 3:15 pm

తొలి ప్రయాణం ప్రారంభించిన తర్వాత నాలుగున్నరేళ్ల అతి తక్కువ సమయంలో ట్రూజెట్ 24 నగరాలకుతన సేవలు విస్తరించింది. దేశంలోఆర్థికశక్తులుగా ఎదుగుతున్న ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు చాలా వాటికి ట్రూజెట్ సేవలు విస్తరించి ఉన్నాయి. సామాన్య ప్రజలకు విమానయానం చేరువ చేయాలనే తమ లక్ష్యాన్ని ఇలాగే కొనసాగిస్తామని ట్రూజెట్ ప్రకటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *