మెగాస్టార్ ఫ్యామిలీ హీరోస్ 2020 కి భారీ ప్లాన్..

మెగా కాంపౌండ్ హీరోల హార్డ్ వర్క్ డెడికేషన్ గురించి ఇండస్ట్రీలో నిరంతరం చర్చ సాగుతుంటుంది. టాలీవుడ్ లో ఎన్ని కాంపౌండ్ లు ఉన్నా డెడికేషన్ తో పర్ఫెక్ట్ ఫిట్ బాడీని మెయింటెయిన్ చేయడంలో మెగా హీరోల తర్వాతనే అన్న టాక్ వినిపిస్తుంటుంది. చరణ్ – బన్ని లాంటి స్టార్లు మెగా యువహీరోలందరికీ స్ఫూర్తి. ఇక 60 ప్లస్ లోనూ మెగాస్టార్ హార్డ్ వర్క్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులందరికీ స్ఫూర్తి నింపుతోంది.

అందుకే మెగా యువహీరోలెవరూ అలసత్వం చూపరు. రిలాక్స్ అయ్యేందుకు ఏమాత్రం ఇష్టపడరు. మెగా కాంపౌండ్ లో మూడో జనరేషన్ హీరోలుగా సాయి తేజ్… వరుణ్ తేజ్.. వైష్ణవ్ తేజ్ వంటి వాళ్లు పర్ఫెక్ట్ ఫిట్ బాడీలతో లుక్ మెయింటెయిన్ చేస్తుండడం చూస్తున్నదే. ఇక లుక్ ఎంత బావుంటే అంతగా అభిమానులకు కనెక్టయ్యే వీలుంటుంది కాబట్టి ఆ విషయంలో ఎంతమాత్రం రాజీకి రారు. ఇక సాయి తేజ్ ఇప్పటికే యాక్షన్ హీరోగా పర్ఫెక్ట్ జిమ్ బోయ్ లుక్ తో మైమరిపిస్తూనే ఉన్నాడు. కాస్త సాఫ్ట్ గా కనిపించే వరుణ్ తేజ్ సైతం ఇటీవల బాక్సింగ్ నేపథ్యంలో సినిమా చేస్తున్నాడు కాబట్టి లుక్ మొత్తం ఛేంజ్ చేసేస్తున్నాడు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో బాక్సర్ గా తనని తాను ప్రూవ్ చేసుకునేందుకు చాలా తీవ్రంగానే వర్కవుట్లు చేస్తున్నాడు.

ఇప్పటికే రూపురేఖలు మొత్తం మారిపోయాయి. నిరంతరం జిమ్ముల్లో గంటల కొద్దీ సమయం వెచ్చిస్తూ చెమటలు పట్టించేస్తున్నాడు. ఆరున్నర అడుగుల బుల్లెట్టులా ఉండే వరుణ్ తేజ్ ప్రత్యేకించి ఒక నిపుణుడి సమక్షంలో ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. వరుణ్ కష్టం చూసేందుకు వెళ్లాడో ఏమో కానీ సాయితేజ్ ఇచ్చిన ఫోజు చూశారు కదా! బావా బావమరుదులు ఇద్దరూ పర్ఫెక్ట్ ఫిట్ బాడీల్ని ప్రదర్శిస్తున్నారు. అన్నట్టు ఆ ఇద్దరిని కలిపి ఓ సినిమా చేయాలి అన్న ఆసక్తిని అల్లు అరవింద్ కనబరిచారు. ఇంతకీ అది 2020లో సాధ్యమయ్యేనా? అన్నది చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *