మెగాస్టార్ సూచన మేరకు కొన్ని సీన్లు మార్చు కున్న కొరటాల

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల ప్రతి సినిమాలోనూ ఏదో ఒక సామాజిక అంశంపై చర్చిస్తారు. తన హీరో చేత ఆ సామాజిక సమస్యపై పోరాటం చేయిస్తారు. ఈ సినిమా కూడా అందుకు భిన్నమేమీ కాదు. ఇందులో కూడా మెగాస్టార్ ఒక సమస్యపై పోరాడతారని సమాచారం.

ఈ సినిమా కథ ప్రకారం చిరంజీవి దేవాలయాలకు ఉండే సమస్యల పై.. దేవాలయాల అధీనంలో ఉండే భూములను అక్రమించే రాజకీయ నాయకులపై పోరాటం చేస్తారట. చిరు దేవాదాయ ధర్మాదాయ శాఖలో పనిచేసే ఒక ఉద్యోగిగా కనిపిస్తారని కూడా టాక్ ఉంది. అయితే కథ దేవాలయాల చుట్టూ తిరిగేది కావడం తో ఈ సినిమా కొంత వరకూ హిందూత్వం టచ్ ఇచ్చినట్టుగా మారిందట. ప్రస్తుతం సమాజంలో హిందుత్వానికి అనుకూలంగా కొందరు.. వ్యతిరేకం గా కొందరు చీలిపోయి ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో హిందుత్వానికి అనుకూలం గా సీన్స్ ఉంటే అదో వివాదంగా మారే అవకాశం ఉందని ఆ సీన్లను న్యూట్రల్ గా మారుద్దామని చిరు సూచించారట.కొరటాల కూడా నిజానికి కమ్యూనిస్టు భావాలు ఉన్న వ్యక్తి. అయితే ఈ సినిమా కథ ప్రకారమే హిందూ అనుకూల సీన్లు డిజైన్ చేసుకున్నారట. అయితే మెగాస్టార్ సూచన మేరకు కొన్ని సీన్లను మార్చేందుకు రెడీ అయ్యారట. ప్రస్తుతం ఆ సీన్లను మార్చి రాస్తున్నారట. ఈ సినిమాలో చిరు సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. మణిశర్మ ఈ సినిమా కు సంగీతం అందిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *