మెగా ఆఫర్ కొట్టేసిన నివేత పేతురేజ్

తమిళ ముద్దుగుమ్మ నివేథ పేతురాజ్ టాలీవుడ్ లో మెల్ల మెల్లగా జెండా పాతుతోంది. తెలుగు ప్రేక్షకులకు మెంటల్ మదిలో చిత్రంతో పరిచయం అయిన ఈ అమ్మడు గత ఏడాది చిత్రలహరి ఇంకా బ్రోచేవారుఎవరురా అనే చిత్రాల్లో నటించి మెప్పించింది. అందంతో పాటు అద్బుతమైన అభినయ ప్రతిభ ఉన్న హీరోయిన్ గా నివేథ పేతురాజ్ కు పేరుంది. అందుకే ఈ అమ్మడిని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తన అల వైకుంఠపురంలో సినిమాలో రెండవ హీరోయిన్ గా తీసుకున్నాడు.

అల్లు అర్జున్ కు కూడా ఈ అమ్మడు నచ్చడంతో తన తదుపరి చిత్రానికి హీరోయిన్ గా పరిశీలిస్తున్నట్లుగా అప్పుడు వార్తలు వచ్చాయి. ఇప్పటికే రెండు మెగా చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు మరో మెగా ఛాన్స్ ను దక్కించుకుంది. చిత్రలహరి చిత్రంలో సాయి ధరమ్ తేజ్ తో నటించిన నివేథ పేతురాజ్ మరోసారి ఆయనతో జత కట్టేందుకు సిద్దం అయ్యింది.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సోలో బ్రతుకే సోబెటర్ చిత్రం తర్వాత సాయి ధరమ్ తేజ్ చేయబోతున్న దేవ కట్టా మూవీలో హీరోయిన్ గా ఈ అమ్మడిని హీరోయిన్ గా ఎంపిక చేశారట. హీరోయిన్ పాత్రకు చాలా స్కోప్ ఉంటుందనే కారణంగా నటన ప్రతిభ ఉన్న అమ్మాయిని ఈ సినిమా కోసం తీసుకోవాలనే ఉద్దేశ్యంతో నివేథ పేతురాజ్ ను హీరోయిన్ గా ఎంపిక చేసినట్లుగా సమాచారం అందుతోంది. ఈ చిత్రమే కాకుండా ప్రస్తుతం రామ్ ‘రెడ్’ లో కూడా ఈ అమ్మడు నటిస్తుంది. కొన్ని చర్చల దశలో ఉన్నాయి. మొత్తానికి ఈ ఏడాది మూడు నాలుగు తెలుగు సినిమాలతో ఈ అమ్మడు బిజీగా ఉండే అవకాశం కనిపిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *