మొత్తం డబ్బులు తిరిగి ఇచ్చేస్తానంటూ బ్రతిమిలాడుతున్న మాల్యా

వేలాది కోట్ల రూపాయిలు బ్యాంకులకు పంగనామం పెట్టేసి.. చెప్పాపెట్టకుండా విదేశాలకు చెక్కేసిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా ఆసక్తికర వ్యాఖ్య చేశారు. ఆయన్ను భారత్ కు అప్పగించాలన్న తీర్పును సవాలు చేస్తూ బ్రిటన్ హైకోర్టులో వేసిన పిటిషన్ విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భం గా కోర్టు బయట ఉన్న మీడియా తో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను బ్యాంకులకు బాకీ ఉన్న మొత్తం డబ్బుల్ని తిరగి ఇచ్చేస్తానని చెప్పారు. తాను చేతులు జోడించి మరీ కోరుతున్నానని.. తాను ఇస్తానని చెబుతున్న మొత్తం డబ్బుల్ని బ్యాంకులు తక్షణమే తీసుకోవాలన్నారు. తాను ఎలాంటి తప్పులు చేయలేదని.. తాను తీసుకున్న అప్పును తిరిగి చెల్లించనందుకు బ్యాంకులు కంప్లైంట్లు చేయటం తో ఈడీ తన ఆస్తుల్ని అటాచ్ చేసిందన్నారు.

తాను చెప్పేది ఒక్కటేనని.. తాను బాకీ ఉన్న మొత్తాన్ని బ్యాంకులు తీసుకోవాలని ఆయన కోరారు. సీబీఐ.. ఈడీ అకారణంగా తనపై చర్యలు తీసుకుంటున్నాయని ఆయన వాపోయారు. ఈ సందర్భంగా భారత్ కు తిరిగి వెళ్లే యోచన ఉందా? అన్న ప్రశ్నకు ఆయన నేరుగా సమాధానం చెప్పలేదు. తన కుటుంబం ఎక్కడ ఉందో.. తనకు ఎక్కడ ప్రయోజనకరం గా ఉంటుందో అక్కడే ఉంటానని పేర్కొన్నారు.

కింది కోర్టు మాల్యాను భారత్ కు అప్పగించాలన్న తీర్పును ఇవ్వగా.. దాన్ని సవాల్ చేస్తూ బ్రిటన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించిన తీర్పు త్వరలో రానున్న వేళ.. మాల్యా నోటి నుంచి ఈ తరహా వ్యాఖ్యలు రావటం ఖాయం. మరి.. మాల్యా ఆఫర్ కు బ్యాంకులు ఎలా రియాక్ట్ అవుతాయో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *