మొరటు ట్రంప్ కు అందమైన పెళ్లాం ఎలా దొరికింది?

ముసలోడు అయిన 70ఏళ్లు దాటిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎక్కడ.. ఆయన భార్య సుకుమారి అందగత్తె మోడల్ అయిన మెలానియా ఎక్కడ.. పైగా ఇద్దరి మధ్య వయసు తేడా ఏకంగా 24 ఏళ్లు.. ట్రంప్ కు 24 ఏళ్లు ఉన్నప్పుడు మెలానియా పుట్టింది. ఇంత గ్యాప్ ఉన్నా వీరి మధ్య ప్రేమ పుట్టింది. పెళ్లి చేసుకున్నారు.. పిల్లలను కన్నారు.

అయినా ప్రేమ గుడ్డిదంటారు. దానికి వయసు తేడా.. చూపు తేడా.. రంగు రుచి వాసన ఉండదంటారు.. ట్రంప్ లవ్ స్టోరీలోనూ అదే జరిగిందట.. ప్రపంచానికి పెద్దన్న.. అగ్రరాజ్యానికి అధ్యక్షుడు కావడంలో ట్రంప్ వెనుకుండి నడిపించింది ఆయన భార్య మెలానియానే..ప్రపంచంలోనే ఎవర్ గ్రీన్ ప్రేమ జంటగా గుర్తింపు పొందిన వీరి ప్రేమ ఎలా పుట్టింది.. ఎలా ఎదిగింది? ఎలా ఒక్కటయ్యారన్నది ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నే.

మెలానియా పుట్టింది అమెరికా కాదు.. యూరప్ లోని స్లోవేనియా.. 1970 ఏప్రిల్ 26న జన్మించింది. పుట్టుకతోనే అందగత్తె అయిన మెలానియా చిన్నప్పటి నుంచి ఫ్యాషన్ డిజైనింగ్ – మోడలింగ్ పై ఆసక్తి పెంచుకుంది. 16వ ఏటనే మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. కష్టపడి తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది.

1998లో ఓ పార్టీలో ట్రంప్ – మెలానియాకు పరిచయం ఏర్పడింది. తొలి చూపులోనే ట్రంప్ తో మెలానియా ప్రేమలో పడిందట. ట్రంప్ కూడా మెలానియా అందనికి ముగ్ధుడయ్యాడట.. 24 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఇద్దరి మధ్య ఉన్నా ఇద్దరి మనసులు కలవడంతో ఒక్కటయ్యారు. వీరి డీప్ ప్రేమ చివరకు పెళ్లితో ఒక్కటైంది. 2005లో ట్రంప్ మెలానియాను వివాహం చేసుకున్నాడు.

మెలానియాతో వివాహం తర్వాతే ట్రంప్ మారాడట.. అంతుకుమందు అమ్మాయిలతో ఎఫైర్స్ – శృంగారం – డేటింగ్స్ – సెక్స్ పిచ్చి ఎక్కువగా ఉండేదట.. ట్రంప్ ను మార్చిన ఘనత మెలానిదే. ఇప్పుడు ట్రంప్ ను అధ్యక్షుడిని చేయడంలో కూడా మెలానియా పాత్ర ఎంతో ఉందట.. ఇలా ప్రపంచంలోనే వీరిద్దరూ ఇప్పుడు ఆదర్శ జంటగా కొనసాగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *