యంగ్ హీరో విక్కీ కౌశిల్ తో కత్రినా ప్రేమాయణం??

కత్రిన వెర్సటైలిటీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎప్పటికప్పుడు ఈ భామ ఏజ్ ని కనిపించుకుండా ఎలా దాచేయగలుగుతోంది? అన్న సందేహం యువతరంలో తప్పనిసరి. 35 ఏజ్ లోనూ ఇంకా టీనేజీ పరువాలతో గుండెల్లో మత్తు చల్లుతోంది. అయితే అందుకు కత్రిన ఎంత హార్డ్ వర్క్ చేస్తుందో తెలిసిందే. నిరంతరం జిమ్- యోగా అంటూ కత్రిన పర్ఫెక్ట్ ఫిట్నెస్ రూల్స్ పాటిస్తుంది.

ఇక ఒంపులు తిరిగిన దేహశిరిని పర్ఫెక్ట్ స్టైలింగ్ తో ఎలివేట్ చేయడమెలానో కత్రిననే అడిగి తెలుసుకోవాలి. నేటితరానికి క్యాట్ ఒక స్ఫూర్తి. ఇక కత్రిన పబ్లిక్ ఈవెంట్లకు .. ర్యాంప్ షోలకు ఎటెండైనప్పుడు తను ఫాలో చేసే ఫ్యాషన్ టెక్నిక్స్ ని యూత్ నిశితంగా పరిశీలిస్తుంటుంది. ఇదిగో లేటెస్టుగా క్యాట్ లేటెస్ట్ లుక్ అంతే జోరుగా వైరల్ అవుతోంది. ఈసారి పూర్తిగా వైట్ అండ్ వైట్ లో ఏదో మాల్ నుంచి బయటకు వస్తోంది. పిక్చర్ పర్ఫెక్ట్ లుక్ ఇది. కత్రిన సింపుల్ గా స్మైలిస్తూ అదరగొట్టింది.

ప్రస్తుతం కెరీర్ కంటే ఈ అమ్మడు యువహీరో విక్కీ కౌశల్ తో ప్రేమాయణానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నట్టుంది. సెట్స్ లో స్నేహం ఎటో వెళుతోందన్న టాక్ వినిపిస్తోంది. విక్కీ- కత్రిన జంట `భూత్ 1- ది హాంటెడ్ షిప్` సిరీస్ లో నటిస్తున్నారు. ఆ క్రమంలోనే ఆ ఇద్దరూ రెగ్యులర్ గా అంథేరిలోని కత్రిన భవంతిలో కలుసుకుంటున్నారని నిండా ప్రేమలో మునిగారని బాలీవుడ్ మీడియా ఒకటే ఊదరగొట్టేస్తున్న సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *