యశోదా టు అపోలో గుండె ప్రయాణం..!

భాగ్యనగరం మరోసారి గుండెమార్పిడికి వేదికైంది. హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ లోని అపోలోని ఒక పేషేంట్ కి అమర్చాల్సిన గుండెని నగర పోలీసులు గ్రీన్ ఛానెల్ ద్వారా సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ నుండి జూబ్లీహిల్స్ లోని అపోలోకి కేవలం 11 నిముషాల వ్యవధిలో చేర్చగలిగారు. పలు కూడళ్లతో నిండి ఉన్న ఈ రోడ్డుపై ఎక్కడికక్కడ ట్రాఫిక్ పోలీసులు సమన్వయంతో వ్యవహరించి అంబులెన్స్ కు గ్రీన్ ఛానెల్ ద్వారా అడ్డంకి లేకుండా వెళ్లేందుకు పనిచేసారు. అసలు ఈ గ్రీన్ ఛానెల్ అంటే ఏమిటంటే .. ప్రముఖుల కోసం రోడ్లపై ప్రత్యేక ఏర్పాట్లు చేయడాన్ని గ్రీన్ ఛానెల్ అని పిలుస్తారు.

దీనిపై పూర్తి వివరాలు చూస్తే … మూడు రోజుల క్రిత రోడ్డు రాంపల్లి నాగారంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న విశాల్ ప్రమాదవశాత్తు కిందపడటంతో తలకు చాలా బలమైన గాయాలయ్యాయి. దీనితో విశాల్ ని వెంటనే సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న విశాల్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వైద్యులు బ్రెయిన్ డెడ్ కేసుగా నిర్ధారించారు. ఈ విషయం తెలుసుకున్న జీవన్ దాన్ నిర్వాహకులు యశోదా ఆస్పత్రికి వచ్చి విశాల్ అవయవాలను దానం చేయడానికి కుటుంబీకులను ఒప్పించారు. దీనితో … వారి అంగీకారంతో విశాల్ గుండెను వైద్యులు సేకరించి ప్రత్యేక బాక్స్ లో ఏర్పాటు చేసుకుని అంబులెన్స్ యశోదా ఆస్పత్రి నుంచి రాత్రి 8.50 గంటలకు బయలు దేరి – 9.01 గంటలకు అపోలో ఆస్పత్రికి చేరుకొని – అపోలో ఆస్పత్రిలో గుండె సమస్యతో బాధ పడుతున్న ఓ వ్యక్తికి ఆపరేషన్ చేసి గుండె మార్పిడి చేశారు.ఇందులో కీలక పాత్ర నగర పోలీసులదే అని చెప్పాలి. సాధారణంగా 8 నుండి 10 గంటల మధ్య ట్రాఫిక్ చాలా హెవీ గా ఉంటుంది. ఆ ట్రాఫిక్ ని మేనేజ్ చేస్తూనే గ్రీన్ ఛానల్ ద్వారా సరైన సమయానికి అంబులెన్స్ హాస్పిటల్ కి చేరేలా చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *