యువకుడి మోసం… ప్రేమ పేరుతో 19 ఏళ్లు శారీరక సంబంధం

ఒకటి కాదు రెండు కాదు… ఏకంగా 19 ఏళ్ల పాటు ఓ మహిళను పెళ్లి పేరుతో మోసం చేశాడు ఓ యువకుడు. వేరే నగరంలో ఉన్న ఆమె దగ్గరకు వెళ్లి మరీ తన కోరికను తీర్చుకుంటూ వచ్చాడు. పెళ్లి చేసుకుందామని అడిగితే… ఆమెకు ఏవో మాయమాటలు చెప్పుకుంటూ కాలం గడిపాడు. చివరకు మరో యువతిని పెళ్లి చేసుకుని ఆమెకు హ్యాండ్ ఇచ్చాడు. అయితే విషయం తెలుసుకున్న బాధితురాలు…యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు. విజయవాడలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే… చెన్నైలోని ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేసే మహిళ(35) 19 ఏళ్ల క్రితం విజయవాడ కానూరు లోని ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదివింది.

ఆ సమయంలో అక్కడే లాబ్ టెక్నీషియన్ గా పని చేస్తున్న పట్నాల శ్రీరామ చంద్రమూర్తి తో పరిచయం ఏర్పడింది. అప్పటినుంచి ఆమెతో చనువుగా ఉంటూ ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పేవాడు శ్రీరామ చంద్రమూర్తి. ఈక్రమంలో ఆమెను లొంగదీసుకుని తన శారీరక వాంఛలు తీర్చుకునేవాడు.ఈలోగా ఆమెకు చెన్నైలో ఉద్యోగం రావటంతో మహిళ అక్కడకు వెళ్లిపోయింది. వీలు చిక్కినప్పుడల్లా చెన్నై వెళ్లి ఆమెతో రాసలీలలు కొనసాగించి వస్తూ ఉండేవాడు. వీళ్ళిద్దరూ కలిసినప్పుడల్లా పెళ్ళి విషయం ఎత్తితే మాత్రం మాయమాటలు చెప్పి తప్పించుకునేవాడు.కొన్నాళ్ల కిందట శ్రీరామ చంద్రమూర్తి వేరొక మహిళను పెళ్ళి చేసుకున్నాడు. ఈ విషయం ఇటీవల చెన్నైలోని సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మహిళకు తెలియటంతో ఆమె విజయవాడ వచ్చి శ్రీరామచంద్రమూర్తిని అతడి తల్లి తండ్రుల్ని నిలదీసింది. దీంతో వారు ఆమెను బెదిరించి కులం పేరుతో దూషించారు. తీవ్రమనస్తాపానికి గురైన బాధితురాలు మోసపోయాననే బాధతో పెనమలూరు పోలీసు స్టేషన్ లో సోమవారం మార్చి 9న ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *