యువతిపై ఇద్దరు పోలీసుల అత్యాచారం..

వాళ్లిద్దరూ లవర్స్. వీకెండ్‌లో ఎక్కడికి వెళ్దాం అని ప్రశ్నించుకున్నారు. పుదుచ్చేరి వెళ్దామా అని అనుకున్నారు. అక్కడైతే ఎవ్వరూ ఉండరు… మరో ప్రపంచానికి వెళ్లిన ఫీల్ కలుగుతుంది అనుకున్నారు.

ఇళ్లలో పెద్దోళ్లకు చెప్పకుండా… చెక్కేశారు. శనివారం పుదుచ్చేరి అంతా తిరిగారు. పర్యాటక ప్రదేశాల్లో పక్షుల్లా విహరించారు. బాగా అలసిపోయారు. ఇక ఆ రాత్రి అక్కడే ఉండి… తెల్లారి వెళ్లిపోదామని అనుకున్నారు. చీప్ అండ్ బెస్ట్‌లో గదులు ఎక్కడ అద్దెకు దొరుకుతాయో చూసుకొని… అక్కడి ఓ లాడ్జిలో రూం తీసుకొని లోపలికి వెళ్లారు. రోజంతా తిరిగినందువల్ల బాగా చిరాగ్గా ఉండి… ఇద్దరూ రీఫ్రెష్ అయ్యారు. “డిన్నర్ ఏం తిందాం”… అని చర్చించుకున్నారు. “చికెన్ బిర్యానీ తిందాం” అన్నాడు. “అమ్మో… చికెన్ వద్దు… కరోనా వైరస్ వస్తుందటగా” అంది ఆమె. “ఏడిశావ్… చికెన్ వల్ల కరోనా ఎందుకొస్తుంది? ఇన్ని రోజులుగా రోజూ టీవీల్లో, పేపర్లలో, సోషల్ మీడియాల్లో చెబుతున్నారు కదా… చికెన్ వల్ల కరోనా అస్సలు రాదు. డోంట్ వర్రీ” అన్నాడు. “సరే చికెన్ బిర్యానీయే తిందాం” అంది. వెంటనే బయటకు వెళ్లి… ఆ పక్కనే ఓ హోటల్‌లో చికెన్ బిర్యానీ తెచ్చాడు. ఇద్దరూ హాయిగా తిన్నారు. ఆ తర్వాత ఒకే బెడ్డుపై పడుకొని… కబుర్లు చెప్పుకుంటున్నారు.

ఆ ఏరియాలో వసూళ్లకు తెగబడే ఇద్దరు పోలీసులున్నారు. వాళ్లే సతీష్ కుమార్, సురేష్. ఇద్దరికీ తెలుసు… లాడ్జిల్లో ప్రేమ జంటలు వస్తుంటారని. రెగ్యులర్‌గా లాడ్జిలకు వెళ్లి… ప్రేమ జంటల్ని బెదిరించి… డబ్బులు లాక్కుంటూ ఉంటారు. తాజాగా లవర్స్ ఉన్న ఆ లాడ్జికి వెళ్లి… ఓ రూం డోర్ కొట్టారు. అందులో ఇద్దరు లవర్స్ డోర్ తీశారు. లోపలికి వెళ్లిన కానిస్టేబుళ్లు… “ఇక్కడ వ్యభిచారం జరుగుతోందని చెప్పి… మిమ్మల్ని ఇద్దర్నీ అరెస్టు చేస్తాం” అన్నారు. దాంతో వాళ్లు టెన్షన్ పడిపోయారు. తమ విషయం పేరెంట్స్‌కి తెలిస్తే ప్రమాదం అనీ, తమపై ఏ కేసులూ పెట్టొద్దనీ, వెళ్లిపోతామనీ వేడుకున్నారు. దాంతో వాళ్ల నుంచీ రూ.20 వేలు తీసుకున్న పోలీసులు… ఈ రాత్రికి ఉండి… తెల్లారి వెళ్లిపోండి అన్నారు. అలా ఆ ప్రేమికులు ఊపిరి పీల్చుకున్నారు.

ఆ తర్వాత మన కథలోని లవర్స్ ఉన్న డోర్ కొట్టారు. అబ్బాయి డోర్ తీశాడు. పోలీసుల్ని చూడగానే ఒకింత టెన్షన్ పడ్డాడు. అక్కడా సేమ్ స్టోరీ చెప్పారు పోలీసులు. ఇద్దరూ భయపడిపోయారు. వాళ్లు కూడా ఇంట్లో చెప్పకుండా వచ్చామనీ, ఇంట్లో వాళ్లకు తెలిస్తే ఊరుకోరనీ చెప్పారు. పోలీసులు డబ్బులు అడిగారు. వాళ్లు తమ దగ్గర డబ్బులు లేవన్నారు. పోనీ నగలు ఉంటే ఇమ్మన్నారు. తమ దగ్గర నగలు కూడా లేవన్నారు.

వెంటనే కానిస్టేబుళ్ల బుద్ధి వంకరపోయింది. డోర్ వేసేసి… ఆ అబ్బాయిని ఓ మూల కూర్చోమన్నారు. నోరెత్తితే… ఇద్దరి పైనా ప్రాస్టిట్యూషన్ కేసు పెట్టి బొక్కలో పెడతామని బెదిరించారు. దాంతో ఆ అబ్బాయికి ఏం చెయ్యాలో అర్థం కాక… మూల కూర్చున్నాడు. తర్వాత ఆమెను ఇద్దరూ సామూహిక అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఇద్దర్నీ మరోసారి బెదిరించి… వెళ్లిపోయారు.

ఈ విషయంపై పోలీసులకు కంప్లైంట్ ఏదీ ఇవ్వకుండా ఆ జంట సైలెంట్‌గా మార్నింగ్ అక్కడి నుంచీ వెళ్లిపోయింది. కానీ… ఎవరు చెప్పారోగానీ… విషయం ఉన్నతాధికారులకు చేరింది. వాళ్లు ఇంటర్నల్‌గా దర్యాప్తు చేశారు. నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఇద్దరు కానిస్టేబుళ్లనూ సస్పెండ్ చేశారు.

త్వరలోనే వాళ్లపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇలా ఇంట్లో చెప్పకుండా పర్యాటక ప్రదేశాలకు వెళ్లే ప్రేమికుల్ని టార్గెట్ చేసే ముఠాలు చాలా ఉంటున్నాయి. జాగ్రత్తగా ఉండాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *