యూపీ లో ఘోర ప్రమాదం: 13 మంది మృతి

ఫిరోజాబాద్‌లోని నాగ్లాఖాంగార్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బుధవారం రాత్రి ప్రైవేట్‌ బస్సును లారీ వెనక నుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో 13 మంది మృతి చెందారు. దాదాపు 31 మంది గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ఆగ్రో-లక్నో జాతీయ రహదారిపై 10 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన జరిగిన సమయంలో బస్సులో సుమారు 45 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు దిల్లీ నుంచి బిహార్‌లోని మోతిహరికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *