రకుల్ జి వైట్ డ్రెస్ లో అదిరిపోయే లుక్

బ్యూటిఫుల్ రకుల్ ప్రీత్ సింగ్ సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నపటికీ సోషల్ మీడియాలో ఫోటో షూట్ల మంటలు పెడుతూ ఉంటుంది. ఇక ఫ్యాషన్ ఈవెంట్లు.. ర్యాంప్ వాక్స్ ఉంటే కనుక రకుల్ లోని ఫ్యాషన్ అపరిచితురాలు బయటకు వచ్చి మరీ తాట తీసేస్తుంది. ఒక్కోసారి రకుల్ క్యాట్ వాక్ చూస్తుంటే ఇంటర్నేషనల్ మోడలేమో అని ఎవరైనా అనుకుంటారు. ఈమధ్య రకుల్ ఫెమినా బ్యూటీ అవార్డ్స్ కార్యక్రమంలో పాల్గొంది.. రెడ్ కార్పెట్ పై వయ్యారంగా నడిచింది.

కార్యక్రమంలో పాల్గొనక మునుపు ఈ డ్రెస్ లో రకుల్ ఫోటోషూట్ చేసింది. ఆ ఫోటోలను రకుల్ తన ఇన్స్టా ఖాతా ద్వారా షేర్ చేసింది. ఈ ఫోటోలకు “నిన్న రాత్రి ఫెమినా బ్యూటీ అవార్డ్స్ 2020 కోసం నా కలర్ తెలుపు” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. డ్రెస్ ఎలా ఉంది అంటే పర్ఫెక్ట్ డిజైనర్ డ్రెస్. హాట్నెస్ కు కేరాఫ్ అడ్రెస్ లాగా కనిపిస్తోంది. ఒంటికి అతుక్కుపోయినట్టుగా ఉన్నప్పటికీ థై స్లిట్ డిజైన్.. ఓపెన్ బ్యాక్.. భుజానికి దుపట్టా తరహాలో వేలాడే క్లాత్ ఎక్స్ టెన్షన్.. అన్నీ సూపరే. ఇక ఈ డ్రెస్ కు తగ్గట్టుగా మేకప్.. హెయిర్ స్టైల్.. రెడ్ కలర్ లిప్ స్టిక్.. మ్యాచింగ్ వైట్ షూ ధరించి సెక్సీ ఎక్స్ ప్రెషన్లు ఇచ్చింది.

సంప్రదాయవాదుల సంగతేమో కానీ ఆధునిక భావాలుండే ఫ్యాషనువాదులకు మాత్రం తప్పనిసరిగా నచ్చుతుంది. ఏదేమైనా బ్యూటీ అవార్డులకు తనదైన శైలిలో అందం జోడించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక రకుల్ సినిమాల విషయానికి వస్తే హిందీలో రెండు సినిమాల్లో.. తమిళంలో మరో రెండు సినిమాల్లో నటిస్తూ తెగ బిజీగా ఉంది. టాలీవుడ్ లో మాత్రం రకుల్ కు ఇప్పుడు ఆఫర్లు లేవు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *