రజినీతో బీజేపీ పొత్తు… తమిళనాట ఫలితం ఇస్తుందా?

తమిళనాడులో రజినీకాంత్ రాజకీయ అరంగేట్రం దాదాపు ఖాయమైంది. ఇటీవల జరుగుతున్న పరిణామాలు, ఆయన చేస్తున్న వ్యాఖ్యలు.. ఈ దిశగా స్పష్టత ఇస్తున్నాయి. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యే నాటికి రజినీ పూర్తి రాజకీయ నాయకుడిగా మారిపోతారన్న మాట.. తమిళ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఇలాంటి సమయంలో.. బీజేపీ సీనియర్ నేత.. కేంద్ర మాజీ మంత్రి పొన్ రాధాకృష్ణన్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

రజినీ రాజకీయాల్లోకి వచ్చాక.. ఆయన పార్టీతో తాము పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉన్నట్టు నర్మగర్భంగా చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం తీవ్రంగా పరిశీలన చేస్తోందని చెన్నైలో అన్నారు. సీఏఏకు మద్దతుగా నిలిచిన రజినీని ప్రశంసించిన ఆయన.. అదే రజినీ మాత్రం ఢిల్లీ అల్లర్లలో ముస్లింలకు అండగా నిలిచిన విషయంలో తప్పు లేదని చెప్పడం.. ఇక్కడ ప్రస్తావనకు తెస్తున్నారు కొందరు.

ఇవన్నీ పరిశీలిస్తే.. తమిళనాడులో కాస్త గట్టిగానే పాగా వేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని చెప్పవచ్చు. అందుకే.. రజినీ లాంటి స్టార్ తో పొత్తుకు ఆ పార్టీ ఆరాటపడుతున్నదని.. స్పష్టమవుతోంది. పొన్ రాధాకృష్ణన్ వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. కానీ.. ద్రవిడ మార్క్ రాజకీయాలు నరనరాన జీర్ణించుకున్న తమిళనాట.. ఉత్తరాది ప్రాబల్యం ఎక్కువగా ఉన్న బీజేపీ విధానాలను వ్యతిరేకించే తమిళనాట.. ఈ చర్యలు ఎంత వరకూ ఫలితాన్నిస్తాయి? అన్నది కాస్త ఆలోచించాల్సిన విషయమే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *