రాజ్యసభకు కవిత??

తన కూతురు కవితకు రాజ్యసభ సీటు కేటాయించే విషయంలో సీఎం కేసీఆర్ తన మనసు మార్చుకున్నారా ? ఆమెను రాజ్యసభకు పంపించకూడదని కొద్దిరోజుల క్రితం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్న గులాబీ బాస్… ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో మళ్లీ కవితనే రాజ్యసభకు పంపాలనే ఆలోచన చేస్తున్నారా ? ఈ ప్రశ్నకు టీఆర్ఎస్ వర్గాల్లో అవుననే సమాధానమే వినిపిస్తోంది. టీఆర్ఎస్ తరపున రాజ్యసభ సీటుపై ఎంతోమంది నేతలు ఆశలు పెట్టుకున్నారు. అయితే వారిలో సీటు ఎవరికి దక్కుతుందనే విషయం మాత్రం కేసీఆర్, కేటీఆర్‌కు మాత్రమే తెలుసని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

చివరి నిమిషం వరకు ఈ విషయాన్ని పార్టీ నాయకత్వం బయటపెట్టే అవకాశం లేదని చర్చించుకుంటున్నారు. రెండు సీట్లకు పోటీ ఎక్కువగా ఉండటంతో… అభ్యర్థుల ఎంపిక విషయంలో సీఎం కేసీఆర్ అనేక లెక్కలు వేసుకుంటున్నారు. అయితే రాజ్యసభకు కవితను పంపే యోచనలో కేసీఆర్ ఉన్నారని మొదట్లో వార్తలు వచ్చాయి. కానీ కేసీఆర్ ఈ ఆలోచన విరమించుకున్నారని… కవిత ప్రత్యక్ష ఎన్నికల ద్వారా చట్టసభలకు వెళతారని మళ్లీ టాక్ వినిపించింది. తాజాగా ఈ విషయంలో కేసీఆర్ మళ్లీ మనసు మార్చుకున్నారని… మరోసారి కవిత పేరును రాజ్యసభకు ఎంపిక చేసే విషయాన్ని ఆయన సీరియస్‌గానే పరిశీలిస్తున్నారని చర్చ జరుగుతోంది.

కవిత లేదా అదే సామాజికవర్గానికి చెందిన దామోదర్ రావు, జూపల్లి రామేశ్వరరావులో ఒకరిని కేసీఆర్ రాజ్యసభకు ఎంపిక చేసే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది. ఇక మరో సీటును హెటిరో డ్రగ్స్ అధినేత బండి పార్థసారధి రెడ్డికి కేటాయించే విషయాన్ని గులాబీ బాస్ పరిశీలిస్తున్నారనే వార్త కూడా వినిపిస్తోంది. రాజ్యసభ రేసులో ఎవరున్నా… కవిత విషయంలో కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశం టీఆర్ఎస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *