రాజ్యసభకు సుప్రీంకోర్టు మాజీ ప్రధాని న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌

భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ ను రాజ్యసభకు నామినేట్ చేస్తూ నోటిఫికేషన్ వెలువడింది. రాష్ట్రపతి కోటాలోని నామినేటెడ్ సభ్యులలో ఒకరు పదవీ విరమణ కారణంగా ఏర్పడిన ఖాళీని భర్తీ చేయడానికి రంజన్ గొగోయిని కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్‌కు నామినేట్ చేసినట్లు రాష్ట్రపతి భవన్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ పేర్కొంది.

జస్టిస్ గొగోయ్ గత ఏడాది నవంబర్‌లో పదవీ విరమణ చేశారు. రాజకీయంగా , మతపరంగా సున్నితమైన అయోధ్య భూ వివాదంలో దశాబ్దాల నాటి తెర దించిన ఘనత ఆయన సొంతం. ఇదిలా ఉంటే అక్టోబర్ 3, 2018 న 46 వ సిజెఐగా ప్రమాణ స్వీకారం చేశారు. 13 నెలల పాటు ఆయన పదవీకాలంలో కొనసాగారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *