రాధికను చంపింది తండ్రే… పోలీసుల దర్యాప్తులో షాకింగ్ నిజాలు…

కరీంనగర్‌ జిల్లాలో రాధిక హత్య కేసులో ఆశ్చర్యపరిచే నిజాలు తెలిశాయి. రాధికను కన్న తండ్రే కాలయముడిలా మారి చంపేశాడని పోలీసుల దర్యాప్తులో తెలిసింది. ఎందుకు చేశారు ఈ పని అంటే… కూతురి వైద్య ఖర్చులు భరించలేక, ఆమెకు పెళ్లి చేసే స్థోమత లేక చంపేశానని అన్నారు. ఆయన అలా చెప్పేసరికి పోలీసులకు ఏమనాలో అర్థం కాలేదు. సాధారణంగా తల్లిదండ్రులెవరూ పిల్లల్ని చంపుకోరు కదా… మరి ఇక్కడ అలా ఎందుకు జరిగిందన్నదానిపై లోతుగా దర్యాప్తు చేయగా… కొన్ని కారణాలు తెలిశాయి. అదే సమయంలో తండ్రి ఆడిన డ్రామా కూడా వెలుగులోకి వచ్చింది. 16 ఏళ్ల రాధిక… కరీంనగర్‌లోని సహస్ర జూనియర్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. ఆమెను కరీంనగర్‌లోని వెంకటేశ్వర కాలనీలో తన ఇంట్లోనే ఫిబ్రవరి 10న ఎవరో చంపేశారు. ఆ సమయంలో… ఆమె తల్లిదండ్రులు కూలి పనుల కోసం బయటకు వెళ్లిపోయారు. ఆ తర్వాత హత్య జరిగింది. ఆమె చనిపోయిన కొంత సేపటి తర్వాత పక్కింట్లోని తొమ్మిదేళ్ల చిన్నారి… ఆ ఇంటికి రావడంతో… ఆ చిన్నారి చనిపోయిన రాధికను చూడటంతో… ఆమె హత్య విషయం అందరికీ తెలిసింది. విషయం తెలుసుకున్న రాధిక తల్లిదండ్రులు…. పనులు మధ్యలోనే ఆపేసి ఇంటికి బయల్దేరారు. అలాగే… పోలీసులు కూడా సమాచారం అందుకొని… రాధిక ఇంటికి వెళ్లి డెడ్ బాడీని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టం కోసం పంపారు. ఆ రోజు దర్యాప్తులో… రాధికను దుండగులు చంపేసి 2.5 తులాల బంగారు ఆభరణాలు, రూ.99 వేల క్యాష్ ఎత్తుకెళ్లారని పోలీసులకు చెప్పాడు. దాంతో పోలీసు అధికారులు… 75 మంది పోలీసులతో… 8 బృందాలు ఏర్పాటు చేశారు. 20 రోజులు వెతికినా… దుండగులు కనిపించలేదు. అదే సమయంలో కుటుంబ సభ్యుల ఫోన్ కాల్ డేటా, ఫోన్ కాల్స్, పోస్ట్ మార్టం రిపోర్ట్… అన్నీ పరిశీలిస్తే… కుటుంబ సభ్యులే ఆమెను చంపేశారా అన్న అనుమానాలు కలిగాయి. అతి సూక్ష్మ ఆనవాళ్లను కూడా కనిపెట్టే జర్మన్‌ 3డీ ఫొటో, వీడియోగ్రఫీ టెక్నాలజీని ఉపయోగించి కొంరయ్య బనియన్‌, చెప్పులపై రక్తపు మరకల ఆనవాళ్లను గుర్తించారు. వాటిని రాధిక DNAతో పోల్చి చూశారు. ఆ క్రమంలో తీగ లాగితే… తండ్రే హత్య చేసినట్లు తేలింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *