రాధిక మా నాన్నకు భార్య మాత్రమే..వరలక్ష్మి

నటిగా కంటే వివాదాలతోనే పాపులర్ అయిన నటి వరలక్ష్మి శరత్ కుమార్. ఒకవైపు నటిస్తూనే తోటి నటుడు విశాల్‌తో ప్రేమాయణం ఈమెను మరింత పాపులర్ చేసింది. తాజాగా వరలక్ష్మి.. తన సవతి తల్లి రాధికపై సంచలన వ్యాఖ్యలు చేసింది.

రాధిక మా నాన్నకు భార్య మాత్రమే.. అమ్మకాదు వరలక్ష్మి సంచలన వ్యాఖ్యలు చేసింది..
నటిగా కంటే వివాదాలతోనే పాపులర్ అయిన నటి వరలక్ష్మి శరత్ కుమార్. ఒకవైపు నటిస్తూనే తోటి నటుడు విశాల్‌తో ప్రేమాయణం ఈమెను మరింత పాపులర్ చేసింది. ప్రస్తుతం ఈ భామకు హీరోయిన్‌గా అవకాశాలు తగ్గిన ..ఆమె తగ్గ పాత్రలు వరలక్ష్మిని వరిస్తూనే ఉన్నాయి. తమిళంలో విజయ్ హీరోగా ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సర్కార్’ సినిమాలో తనదైన విలనిజాన్ని చూపించి ఔరా అనిపించింది వరలక్ష్మి శరత్ కుమార్. తెలుగులో కూడా ఈమె సందీప్ కిషన్ హీరోగా నటించిన ‘తెనాలి రామకృష్ణ బీఏ ఎల్ఎల్‌బీ చిత్రంలో ముఖ్యపాత్రలో నటించిన సంగతి తెలిసిందే కదా. తాజాగా వరలక్ష్మి.. తన తండ్రి శరత్ కుమార్ రెండో పెళ్లి చేసుకున్న అలనాటి హీరోయిన్ రాధికపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన తండ్రి శరత్ కుమార్ ఆమెను పెళ్లిచేసుకున్నా.. ఆమె తనకు ఎప్పటికీ అమ్మ కాలేదని స్పష్టం చేసింది. ఎవరికైనా అమ్మ ఒక్కరే ఉంటారిని స్పష్టం చేసింది. ఇక మా నాన్న రెండో పెళ్లి చేసుకున్న రాధికను నేను ఆంటీ అని మాత్రమే సంబోధిస్తానని వ్యాఖ్యానించింది. ఇదే సమయంలో ఆమెకు ఇచ్చే గౌరవాన్ని కూడా ఇస్తానని వ్యాఖ్యానించింది. అంతేకాదు అవకాశం దొరికినపుడల్లా..తనలోని బోల్డ్‌నెస్‌ను బయట పెడుతూ ఉంటుంది వరలక్ష్మి శరత్ కుమార్. ఒక తనకు ఏది తోస్తే.. అది చేస్తానని అందుకే తనతో మాట్లాడేందకు అందరు భయపడుతూ ఉంటారని వ్యాఖ్యానించింది. తాజాగా ఈమె ఇండస్ట్రీలోనే ఉన్న కౌస్టింగ్ కౌచ్‌పై గళమెత్తింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *