రానా ‘అరణ్య’ విడుదల ఎప్పుడు..

దగ్గుబాటి రానా హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం “అరణ్య”. ప్రభు సాలొమోన్ దర్శకత్వంలో త్రిభాషా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా తెలుగు తమిళ హిందీ బాషలలో ఒకేసారి విడుదల కానుంది. అయితే ఏప్రిల్ 2న విడుదల కావాల్సిన ఈ సినిమా విడుదల తేదీని చిత్రయూనిట్ వాయిదా వేయడం జరిగింది. కరోనా ఎఫెక్ట్ ను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా విడుదలను నిలిపివేస్తున్నట్లు చిత్ర నిర్మాతలు తెలిపారు.

కరోనా వైరస్(కోవిద్-19) భయం భారతదేశ నలుమూలల పాకింది. దేశ జనమంతా కరోనా భయంతో ఏ పని చేయలేక పోతున్నారు. ఎక్కడికి వెళ్లలేకపోతున్నారు. ఇంట్లో నుండే బయటికి రానివాళ్లు ఇంకా థియేటర్ వరకు వచ్చి మా సినిమాను ఏం చూస్తారు. అందుకే దేశంలో కరోనా పరిస్థితులు సర్దుమనిగితే ఈ చిత్రాన్ని ఏప్రిల్ చివరిలోపు విడుదల చేస్తామని అప్పటికి కాకపోతే మే నెలలో రిలీజ్ చేయనున్నట్లు చిత్ర దర్శక నిర్మాతలు వెల్లడించారు.

రానా దగ్గుబాటి ప్రధానంగా నటిస్తున్న ఈ చిత్రంలో విష్ణువిశాల్ పులకిత్ సామ్రాట్ మరో కీలక పాత్రలను పోషిస్తున్నారు. శ్రీయా పిల్గాఒంకర్ జోయా హుస్సేయిన్ ఇతర పాత్రలలో కనిపించనున్నారు. త్రిభాషా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాను ఈరోస్ ఇంటర్నేషనల్ వారు నిర్మిస్తుండటం విశేషం. త్వరలోనే కరోనా వైరస్ నశించిపోయి వాయిదా పడిన అరణ్య విడుదల అయితే బాగుంటుందని సినీ అభిమానులు కోరుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *