రైతు భరోసా కేంద్రాలను త్వరగా పూర్తి చేయండి -సీఎం జగన్

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్దిపై ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష*
*పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి సహా అధికారులు హాజరు*
*ఉపాధిహామీ పనులు, గ్రామ సచివాలయాలు, రైతు భరోసాకేంద్రాలు, నాడు– నేడు కింద స్కూళ్లలో ప్రహరీ గోడల నిర్మాణం, వాటర్‌గ్రిడ్‌ అంశాలపై సీఎం సమీక్ష*
ఈ ఏడాది వర్షాలు బాగా కురిసినందున వ్యవసాయరంగంలో పనులు లభిస్తున్నాయన్న అధికారులు
మార్చి నాటికి అనుకున్న పనిదినాలతో లక్ష్యాన్ని చేరుకుంటామన్న అధికారులు
ఉపాధి హామీ నిధుల ఖర్చులో లక్ష్యాలను చేరుకుంటున్నామన్న అధికారులు
గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలను వీలైనంత త్వరగా పూర్తిచేయాలన్న సీఎం
తర్వాత మినీ గోడౌన్ల నిర్మాణంపైనా దృష్టిపెట్టాలన్న సీఎం
ఉపాధి హామీ నిధులతో స్కూళ్లకు ప్రహరీగోడలను నిర్మించాలన్న సీఎం
ఫిబ్రవరి నుంచి ఇంటివద్దకే పెన్షన్లు : సీఎం
వాలంటీర్ల ద్వారా లబ్ధిదారులకు చేరవేత : సీఎం
పెన్షన్లకోసం ఎదురుచూపులు, వేచి చూసే పరిస్థితి లేకుండా చేయడానికే ఈ చర్యలు
సర్వేలతో ముడిపెట్టి ఇళ్లపట్టాలను నిరాకరించవద్దు: స్పష్టంచేసిన సీఎం
క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి.. ఆమేరకు లబ్ధి దారులను గుర్తించండి: సీఎం
అర్హులైన వ్యక్తులు ఎంతమంది ఉన్నా పట్టాలు ఇవ్వాల్సిందే : సీఎం
*కొత్తగా మరో 300 గ్రామ సచివాలయాలు*
వీటిద్వారా మరో 3వేలకు పైగా ఉద్యోగాలు
సచివాలయాల్లో ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఉద్యోగాలు 15,971
వీటన్నింటి భర్తీకి సీఎం ఆదేశాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *