వడ్డీరేట్ల తగ్గింపు భారం ఎంపీసీపైనే.. ఆర్.బి.ఐ శక్తికాంత్ దాస్

కరోనా వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థ మందగమనం బాట పట్టకుండా ఆర్బీఐ చర్యలకు దిగింది. అయితే కీలక వడ్డీ రేట్ల తగ్గింపుపై ఆర్బీఐ నిర్ణయం తీసుకుంటుందని అంతా భావించినప్పటికీ ఎంపీసీ ఈ నిర్ణయం తీసుకుంటుందని దాస్ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ పేర్కొన్నారు.

ఆర్థిక మందగమనం నేపథ్యంలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ కీలకమైన వడ్డీరేట్ల విషయంలో బేసిస్ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంటారని అంతా భావించారు. కానీ తాజా పరిస్థితితో పాటు, కరోనా ప్రభావం, అలాగే యెస్ బ్యాంకు పునరుద్ధరణపై మాత్రమే ఆర్బీఐ గవర్నర్ వ్యాఖ్యలు పరిమితం అయ్యాయి. ఈ సందర్భంగా కరోనా ఫలితంగా ప్రస్తుతం పర్యాటక , ఆతిథ్య, విమానయానం రంగాలు పూర్తిగా దెబ్బ తిన్నాయని శక్తికాంత్ దాస్ పేర్కొన్నారు.

అయితే కీలకమైన వడ్డీ రేట్లపై ఎంపిసి సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని దాస్ పేర్కొన్నారు. ఏ అవకాశాన్ని తోసిపుచ్చడం లేదు (రేటు తగ్గింపుపై). మేము COVID-19 ప్రభావాన్ని అంచనా వేస్తున్నాము మేము MPC లో మా వృద్ధి అంచనాలను ఇస్తామని పేర్కొన్నారు. అంతేకాదు యెస్ బ్యాంకు సంక్షోభం నుంచి బయటపడేసేందుకు ద్రవ్యసహకారం కూడా అందించేందుకు వెనుకాడమని తెలిపారు.

కరోనా కలకలంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతున్నాయి. ఆసియా, అమెరికా, యూరప్ మార్కెట్లు అనే తేడా లేకుండా మార్కెట్లలో భారీ పతనం నమోదవుతోంది. ఈ క్రమంలోనే అమెరికాలో 150 బేస్ పాయింట్ల కోత విధిస్తూ యూఎస్ ఫెడ్ నిర్ణయం తీసుకుంది. ఈ స్థాయిలో రేట్ల కోత జరగడం అమెరికా చరిత్రలో ఇది రెండోసారి మాత్రమే. యూఎస్ ఈ ప్రకటన చేసిన కాసేపటికే ఇంగ్లాండ్, కెనడా, హాంకాంగ్ మానిటరీ అథారిటీ, ఖతార్ సెంట్రల్ బ్యాంక్, యూఎఈ సెంట్రల్ బ్యాంక్, బెహ్రయిన్ సెంట్రల్ బ్యాంక్, సౌదీ అరేబియా మానిటరీ అథారిటీ కూడా 50 పాయింట్లు రేట్ల కోతలు విధిస్తూ ప్రకటనలు చేశాయి. ఇదిలా వుండగా జపాన్ కూడా ఎక్స్‌చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్‌ కొనుగోళ్లను రెండింతలు చేసింది.

అలాగే కార్పోరేట్ బాండ్స్, కమర్షియల్ పేపర్ల కొనుగోళ్లకు తెరలేపింది. దీంతో జపాన్ కూడా రేట్ల కోత వైపే అడుగులు వేస్తున్నట్లు కనబడుతోంది. ఈ నేపథ్యంలో భారత్‌లో కూడా రేట్ల కోత అనివార్యమైంది. దీనిపై ఆర్బీఐ నిర్ణయానికి వచ్చిందని ఆర్థికశాస్త్ర నిపుణులు అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *