వరుడి తండ్రితో వధువు తల్లి పరార్

మారిన కాలంతో పాటు మనుషుల్లో అంతో ఇంతో మార్పు సహజమే. కాకుంటే ఎప్పుడూ లేని రీతిలో గడిచిన పదేళ్ల కాలంలో మానవ సంబంధాల విషయంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. బంధాలకు.. అనుబంధాలకు కొత్త అర్థాలు ఇవ్వాల్సిన దుస్థితి. ఎవరిని ఎప్పుడు నమ్మాలన్నా కించిత్ సందేహం ఉన్నప్పటికీ.. జీవితాంతం తోడుగా.. నీడగా ఉంటానని పరస్పరం బాసలు చేసుకున్న భార్యభర్తల బంధం సైతం కొత్త సందేహాలకు తావిచ్చేలా మారటానికి మించిన బ్యాడ్ లక్ మరొకటి ఉండదేమో?

ఈ డిజిటల్ యుగంలో సాధ్యం కానిది ఏదీ ఉండదన్న విషయం కొన్ని పరిణామాల్ని చూస్తే.. ఇట్టే అర్థమైపోతుంది. దీనికి తగ్గట్లే కొద్ది రోజుల క్రితం గుజరాత్ లో చోటు చేసుకున్న ఒక ఉదంతం మీడియా సంస్థల్లో పెను సంచలనంగా మారింది. ఒక రాష్ట్రంలో జరిగిన ఘటన కు అంతగా ప్రాధాన్యత ఇవ్వని జాతీయ మీడియా సైతం.. ఈ వార్తకు మాత్రం భారీగా చోటిచ్చింది. ఈ వార్తను చదివినోళ్ల లో చాలా మంది ముక్కున వేలేసుకుంటూ.. కలికాలం అంటూ బుగ్గలు నొక్కుకునే పరిస్థితి.

పెళ్లికొడుకు తండ్రి.. పెళ్లి కుమార్తె తల్లి ఇద్దరూ మనసు పడి పిల్లల పెళ్లికి కాస్త ముందుగా తామే జంటగా పరారైన ఉదంతం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. సూరత్ కు చెందిన 46 ఏళ్ల హిమ్మత్ పాండవ్.. నవ్ సారీకి చెందిన శోభనా పరస్పరం ఆకర్షితులు కావటం.. వారిద్దరూ లేచి పోవటం తో వారిద్దరి పిల్లల పెళ్లి నిలిచి పోయింది. ఇది వైరల్ గా మారి.. మీడియాలోనూ.. సోషల్ మీడియా లోనూ పెద్ద ఎత్తున వైరల్ కావటం.. ఇరు కుటుంబాల్లోని పెద్దల ఒత్తిడి తో కొద్ది రోజులకే ఈ జంట తిరిగి వచ్చింది.

పెళ్లి కుమార్తె తల్లిని.. భర్త ఇంట్లోకి రానిచ్చేందుకు నో చెప్పటంతో ఆమె తన తల్లిదండ్రుల వద్దే ఉండిపోయారు. తొలిసారి లేచిపోయిన సందర్భం గా మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు.. తాజాగా మరోసారి లేచిపోయిన వైనం పై మాత్రం మౌనంగా ఉండి పోయారు. లేచిపోయిన ఈ ఇద్దరూ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు కావటం.. అప్పట్లో పెళ్లి చేసుకోవాలనుకుంటే అందుకు పెద్దలు నో చెప్పటంతో వేర్వేరు వ్యక్తుల్ని పెళ్లాడారు. తాజాగా వారిద్దరూ మరోసారి లేచిపోవటం చూసినప్పుడు.. మనసులు కలిసిన ఇద్దరిని వేరుగా ఉంచటం సాధ్యం కాదన్నది తాజా ఉదంతం తో మరోసారి తేలిపోయిందని చెప్పక తప్పదు.

5 Comments on “వరుడి తండ్రితో వధువు తల్లి పరార్”

  1. [url=https://cialis5.com/]cialis generic over the counter[/url] [url=https://paxil10.com/]paxil for ocd[/url] [url=https://lexaporo.com/]lexapro 10 mg[/url] [url=https://advair2019.com/]advair 250 canada[/url] [url=https://hydrochlorothiazide2.com/]30 hydrochlorothiazide 25 mg[/url] [url=https://advair250.com/]advair diskus 500 50 mcg coupon[/url] [url=https://cleocing.com/]cleocin capsules 150mg[/url] [url=https://prazosin.us.com/]prazosin 8 mg[/url] [url=https://viagra2019.com/]viagra buy online no prescription[/url] [url=https://albenzamed.com/]albenza cost in canada[/url]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *