వరుస చిత్రాలతో దూసుకు వెళ్తున్న కియారా అద్వానీ

బాలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లో కూడా మంచి గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ కియారా అద్వానీ. ఈ అమ్మడు ప్రస్తుతం బాలీవుడ్ లో ఏమాత్రం గ్యాప్ లేకుండా వరుస చిత్రాలు చేస్తోంది. బ్రేక్ తీసుకోకుం డా సినిమాలు చేస్తున్న కియారా అద్వానీ తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది. ముఖ్యంగా తన పెళ్లి ప్లాన్స్ మరియు తాను ఎలాంటి వ్యక్తిని చేసుకోవాలనుకుంటున్నది అన్ని కూడా ఆ ఇంటర్వ్యూలో చెప్పింది.

ముందుగా తాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్న వ్యక్తి ఎప్పుడు కూడా సరదాగా ఉండాలి. సందర్బం ఎలాంటిది అయినా కూడా జోవియల్ గా ఉండే వాడు అయితే నాకు నచ్చుతాడు అంది. ఇక నా అభిప్రాయాలు నా ఆలోచనలకు విలువ ఇచ్చే వ్యక్తిని నేను కోరుకుంటున్నాను అంది. ఇక చివరగా ముక్కు మీద కోసం ఉండే వ్యక్తి అయితే నాకు అస్సలు వద్దు అంది. అగ్రెసివ్ క్యారెక్టర్ అయితే నాకు సెట్ అవ్వడు. అలాంటి వాడిని నేను కోరుకోవడం లేదు అంది.

అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ లో హీరోయిన్ గా నటించిన తర్వాత కియారా అద్వానీ క్రేజ్ అమాంతం పెరిగి పోయింది. బాలీవుడ్ తో ఈ అమ్మడు బిజీ అవ్వడానికి కారణం కబీర్ సింగ్ అనడం లో ఎలాంటి సందేహం లేదు. కబీర్ సింగ్ లో హీరో చాలా అగ్రెసివ్ గా ఉంటాడు. చిన్న విషయాలకు కూడా చాలా యాంగ్రీ అవుతాడు. ఆ సినిమా ప్రభావమో లేదంటే మరేంటో కాని అలాంటి వ్యక్తిని మాత్రం పెళ్లి చేసుకోను అంటూ కియారా చెప్పడం జరిగింది.

కబీర్ సింగ్ పాత్రను దగ్గర నుండి చూడటం వల్ల అలాంటి అగ్రెసివ్ పర్సన్ లైఫ్ లో కి వస్తే ఇబ్బందులు ఎదురవుతాయేమో అని అలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తిని దూరం పెడుతున్నావా అంటూ నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *