వాట్సప్‌లో డార్క్ మోడ్ వచ్చేసింది… సెట్టింగ్స్ మార్చండి ఇలా

ప్రపంచమంతా ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న డార్క్ మోడ్ ఫీచర్ వాట్సప్‌లో వచ్చేసింది. ఒక యాప్‌లో డార్క్ మోడ్ ఫీచర్ కొత్తేమీ కాదు. ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్ లాంటి యాప్స్‌లో డార్క్ మోడ్ ఫీచర్ ఉంది. వాస్తవానికి డార్క్ మోడ్ ఫీచర్‌ను వాట్సప్ చాలా ఆలస్యంగా రిలీజ్ చేసింది. ఈ ఫీచర్ కోసం వాట్సప్ యూజర్లు చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. మొదట బీటా యూజర్లకు డార్క్ మోడ్ రిలీజ్ చేసిన వాట్సప్… ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాట్సప్ యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. డార్క్‌మోడ్ ఉపయోగించడం వల్ల కళ్లకు అలసట తగ్గుతుందని చెబుతోంది వాట్సప్. ఆండ్రాయిడ్ 10, ఐఓఎస్ 13 ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న స్మార్ట్‌ఫోన్లలో డార్క్ మోడ్ ఫీచర్ ఆటోమెటిక్‌గా వచ్చేస్తుంది. అంతకన్నా తక్కువ వర్షన్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్నట్టైతే సెట్టింగ్స్ మార్చాలి.

WhatsApp Dark Mode: సెట్టింగ్స్ మార్చండి ఇలా

ముందుగా ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ ఓపెన్ చేసి మీ వాట్సప్ అప్‌డేట్ చేయండి.
త్రీ డాట్ మెనూ క్లిక్ చేసి సెట్టింగ్స్ ఓపెన్ చేయండి.

ఛాట్స్ సెలెక్ట్ చేయండి.
అందులో Theme ఆప్షన్ కనిపిస్తుంది.
అందులో Dark సెలెక్ట్ చేస్తే మీ వాట్సప్ డార్క్‌మోడ్‌లోకి మారిపోతుంది.

వాట్సప్‌లో డార్క్ మోడ్‌తో పాటు సరికొత్త సెక్యూరిటీ ఫీచర్‌ని కూడా అందుబాటులోకి తీసుకొస్తోంది. యూజర్లు గూగుల్ డ్రైవ్‌లోకి బ్యాకప్ చేసిన మీడియా, మెసేజెస్‌కు పాస్‌వర్డ్ ప్రొటెక్షన్ పెట్టుకోవచ్చు. ఇందుకోసం Chat Backup సెక్షన్‌లో Password Protect Backups ఫీచర్‌ని అందిస్తోంది. ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా యూజర్లకు మాత్రమే లభిస్తుంది. ఈ ఫీచర్‌ని పరీక్షించిన తర్వాత యూజర్లందరికీ కొత్త సెక్యూరిటీ ఫీచర్ రిలీజ్ చేయనుంది వాట్సప్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *