వాట్సప్‌ సందేశం..ఎస్‌ఐ అదృశ్యం

కర్నూలు జిల్లాలోని రుద్రవరం పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌ఐ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అర్ధరాత్రి ఎస్‌ఐ విష్ణునారాయణ పోలీసుల గ్రూప్‌లో పెట్టిన వాట్సప్‌ సందేశం కలకలం రేపింది. ‘‘ఈ మెస్సేజ్‌ చదివే సమయానికి నేను బతకవచ్చు లేక చనిపోవచ్చు. దయచేసి నన్ను అందరూ చెడుగా అనుకోవద్దు’’ అని వాట్సప్‌లో పోస్టు చేశారు. ఆళ్లగడ్డ డీఎస్పీ ఆ సందేశం చూసి అర్థరాత్రి ఎస్‌ఐ ఇంటికి వెళ్లి సముదాయించారు. తెల్లవారుజామున 4గంటల సమయంలో విష్ణునారాయణ ఇంటి నుంచి కారులో బయటకు వెళ్లిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నారు. ఎస్‌ఐ విష్ణునారాయణ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *