వాయు కాలుష్యం వల్ల భారతీయుల ఆయుస్సు రోజు రోజుకు తగ్గుతుంది..

వాయు కాలుష్యం ..ప్రస్తుతం ప్రపంచ దేశాలని పట్టిపీడిస్తున్న అతిముఖ్యమైన సమస్యలలో ఒకటి. ఈ కాలుష్యం భారీ నుండి తప్పించుకోవడానికి ప్రపంచ దేశాలు అనేక చర్యలు తీసుకుంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత కాలుష్యమైన టాప్ 20 నగరాల లిస్ట్ ని విడుదల్ చేస్తే అందులో 14 ఒక్క భారతదేశంలోనే ఉన్నాయంటూ మన దేశం ఎలాంటి కాలుష్య కోరల్లో చిక్కుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక మన దేశంలోని ఈ వాయుకాలుష్యం వల్ల ప్రజల జీవనా స్థితిలో అనేక మార్పులు వచ్చినట్టు పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇక తాజాగా వాతావరణ మేధో బృందం వాయుకాలుష్యం తో వచ్చే జబ్బుల వల్ల భారత్ ప్రజల జీవన కాలం 20 నెలలు తగ్గిందని తన నివేదికలో వెల్లడించింది.

వాయు కాలుష్యం వల్ల భారతీయుల ఆయుష్షు రోజురోజుకి తగ్గిపోతుంది అని ఇది ప్రపంచంతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉందని సీఎస్ ఈ తన నివేదికలో వెల్లడించింది. కర్బన ఉద్గరాలు ఓజోన్ క్షిణత ధూమపానం గృహకాలుష్యం వాహన పరిశ్రమల కాలుష్యం వల్ల వాయువు ప్రమాదక స్థాయిలో కలుషితం కావడమే దీనికి ప్రధాన కారణం అని వెల్లడించింది. ముఖ్యంగా వాయుకాలుష్యం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు సోకి 49 శాతం ఊపిరితిత్తుల కాన్సర్ వల్ల 33 శాతం మంది డయాబెటిస్ గుండెకి సంబంధించిన వ్యాధుల వల్ల 22 శాతం మంది గుండెపోటుతో 15 మంది మరణిస్తున్నారని సిఎస్ ఈ తెలిపింది. అలాగే మనదేశంలో ఈ లెవెల్ లో వాయుకాలుష్యం భారీగా పెరిగిపోవడానికి మరో ముఖ్యకారణం ప్రజలు వంట కోసం కట్టెలను కిరోసిన్ వంటి ఇంధనాలు మండిస్తున్నారని వారికి ఆధునిక వసతులు లేవని ఫలితంగా గృహ కాలుష్యం కూడా పెరిగిపోతున్నదని ఆందోళన వ్యక్తం చేసింది.

ఈ వాయుకాలుష్య సమస్య దేశంలోని ప్రధానమైన నగరాలలో ఎక్కువగా ఉందని ఆ నగరాలలో నివసిస్తున్న వారు ఆ వాహనాల నుండి వెలువడే విష వాయువుని పీల్చడం వల్ల వారి శరీరంలోని అనేక అవయవాలు పాడైపోయినట్టు తమ పరిశోధనలో తేలినట్టు తెలిపారు. ప్రజలు ఎప్పటికైనా అప్రమత్తమై జాగ్రత్తలు తీసుకోక పోతే మనిషి జీవన కాలం మరింత క్షిణించే అవకాశం ఉన్నట్లు నిపుణులు వెల్లడించారు. ఇదే సమయంలో పర్యావరణ ప్రియులు కేంద్రం పర్యావరణ సమస్య పై అంతగా దృష్టి పెట్టడం లేదు అని ఫైర్ అవుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *