వావ్ క్రేజీ చిరు.. మోహన్ బాబు

మెగాస్టార్ చిరంజీవి విలక్షణ నటుడు మోహన్ బాబులది విచిత్రమైన బంధం. కొన్నిసార్లు ఆప్తమిత్రుల్లా చాలా సన్నిహితంగా కనిపిస్తారు. కొన్నిసార్లు శత్రువుల్లా కలహించుకుంటారు. ఐతే వజ్రోత్సవ వేడుకలప్పుడు.. చిరంజీవికి పద్మభూషణ్ అవార్డు వచ్చినపుడు ఇద్దరి మధ్య అనుకోకుండా అగాథం ఏర్పడింది కానీ.. ఆ తర్వాత కొన్నేళ్లకు ఇద్దరూ కలిసిపోయారు.

అప్పట్నుంచి చాలా సన్నిహితంగా మెలుగుతున్నారు. ఇటీవల మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కార్యక్రమంలో చిరు-మోహన్ బాబు ఎంత సన్నిహితం గా మెలిగారో.. ఒకరి గురించి ఒకరు ఎంత గొప్పగా మాట్లాడుకున్నారో తెలిసిందే. ఆ సందర్భంగా వాళ్ల కెమిస్ట్రీ ఇండస్ట్రీ హాట్ టాపిక్గా మారింది. ఈ కెమిస్ట్రీని సినిమాల్లోనూ చూస్తే ఎంత బాగుంటుందో అన్న ఆలోచన కూడా కలిగింది కొందరికి. ఐతే ఇప్పుడు ఆ ఊహ నిజం కాబోతున్నట్లుగా ఒక క్రేజీ రూమర్ ఇండస్ట్రీలో హల్చల్ చేస్తోంది.

చిరు సినిమాలో మోహన్ బాబు నటించబోతున్నాడన్నది తాజా సమాచారం. ప్రస్తుతం చిరు.. కొరటాల శివ దర్శకత్వం లో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో విలన్ పాత్ర లో మోహన్ బాబు కనిపిస్తాడటంటున్నారు. ఇప్పటికే చర్చలు జరిగాయని.. మోహన్ బాబు ఈ సినిమాలో నటించడానికి అంగీకారం చెప్పేశాడని అంటున్నారు. ఇదే నిజమైతే మాత్రం ఇంతకంటే ఎగ్జైటింగ్ న్యూస్ మరొకటి ఉండదు.

  • గతంలో ‘కొదమసింహం’ ‘కొండవీటి దొంగ’ సహా పలు చిరు సినిమాల్లో మోహన్ బాబు విలన్ పాత్రలతో అదర గొట్టాడు. టాలీవుడ్ చరిత్ర లోనే అత్యంత గొప్ప విలక్షన నటుల్లో మోహన్ బాబు ఒకడు. ఆయన్ని ఈ తరం దర్శకులు సరిగా ఉపయోగించుకోవడం లేదు. ఆయన కూడా సినిమాలు చేయడం బాగా తగ్గించేశారు. ఐతే ఇటీవలే మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. తమిళంలో మణిరత్నం సినిమా ‘పొన్నియన్ సెల్వన్’తో పాటు సూర్య మూవీ ‘ఆకాశమే నీ హద్దురా’లోనూ నటిస్తున్నారు. తెలుగులో చిరు సినిమా తో రీఎంట్రీ ఇచ్చేట్లయితే మాత్రం మోహన్ బాబు మళ్లీ టాప్ ఫామ్ అందుకోవడం ఖాయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *