విజయ్ రోడ్ పైన్ రొమాన్స్ చేస్తున్నాడు ..

డాషింగ్ డైరెక్టర్ పూరి రీసెంట్ గా ఇస్మార్ట్ శంకర్ చిత్రం తో సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే .ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో పాన్ మూవీ చేస్తున్నాడు. జనవరి 20న ఈ చిత్ర ఫస్ట్ షెడ్యూల్ ముంబైలో ప్రారంభించారు. ఈ మధ్యనే అది పూర్తి చేసుకొని .. రెండో షెడ్యూల్ మొదలుపెట్టారు. ఈ షెడ్యూల్ కోసం రూ.5 కోట్లు వెచ్చించి సెట్ వేయించారట పూరి. ఈ షెడ్యూల్ లో హీరోయిన్ అనన్య పాండే జాయిన్ అయ్యారు.
ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ కు సంబందించిన పిక్స్ బయటకు వచ్చాయి. విజయ్ దేవరకొండ బైక్‌పై కూర్చుని ఉండగా, హీరోయిన్ అనన్య ఆయన ముందు కూర్చుని ఉన్నారు. రాత్రివేళల్లో ఈ సీన్‌ను చిత్రీకరిస్తుండగా ఎవరో ఫొటోలు తీసారు. దాంతో ఈ ఫొటోలు కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ మూవీ కి మొన్నటి వరకు ఫైటర్ అని ప్రచారం కాగా..ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ‘లైగర్’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నాడట. ఈ మూవీ లో విజయ్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్ గా కనిపించనున్నారు. దీని కోసం ఆయన ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ఇక ఈ చిత్రంతో విజయ్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. బాలీవుడ్ బడా దర్శకనిర్మాత కరణ్ జోహార్ ఈ చిత్ర నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. పూరి కనెక్ట్స్ బ్యానర్ పై ఛార్మి నిర్మిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *