విమానంలో మహిళపై లైంగిక వేధింపులు.. వ్వక్తి అరెస్ట్

రువాండా ఎయిర్‌పోర్ట్ అంత బిజీగా ఏమీ లేదు. అయినప్పటికీ… కొన్ని కరోనా సోకిన దేశాలకు తప్ప ఇతర దేశాలకు విమానాల రాకపోకలు సాగుతున్నాయి. ఆ క్రమంలో ఇండియా… గుజరాత్‌కి చెందిన నిందితుడు అంకిత్ పటేల్ విమానం ఎక్కాడు. టికెట్‌లో సీట్ నంబర్ చూసుకున్నాడు. “బయటా ఎండాగానే ఉంది… ఫ్లైట్ లోనూ ఇలాగే ఉంది” అనుకుంటూ… తన సీటులో కూర్చున్నాడు. “ఈ విమానంలాగానే ఏడ్చింది సీటు కూడా… పక్కకు ఒరిగిపోతోందే… ఎలా కూర్చోవాలి… ఎలా ప్రయాణించాలి” అని తిట్టుకుంటూ కూర్చున్నాడు. మిగతా ప్రయాణికులు కూడా… హీట్ బాగా ఉంది… ఏసీ పెంచితే బాగుండు అనుకుంటూ… విమానంలో తమ తమ సీట్లలో కూర్చున్నారు. కాసేపటికి ఫ్లైట్ స్టార్ట్ అయ్యింది. టేకాఫ్ అవుతుంటే… చాలా మంది దేవుణ్ని తలచుకున్నారు. ప్రయాణం బాగా సాగాలని కోరుకున్నారు.

ఏ బస్సో, రైలో అయితే… కిటికీలోంచీ అన్నీ చూస్తూ… కాలక్షేపం చెయ్యొచ్చు. అది ఫ్లైట్ కదా… విండో లోంచీ చూస్తే మేఘాలు తప్ప ఏమీ కనిపించట్లేదు. దాంతో అందరూ నిద్రలోకి జారుకున్నారు. విమానం… రువాండా నుంచీ… ముంబైకి వెళ్తోంది. అందరూ నిద్రపోతుంటే… అంకిత్ పటేల్ మాత్రం నిద్రపోలేదు. జర్నీని ఎంజాయ్ చెయ్యాలి గానీ నిద్రపోతే ఎలా అనుకున్నాడు. నిద్ర రాకుండా ఉండేందుకు ఏం చెయ్యాలా అని చుట్టూ చూశాడు. ముందు ఉన్న సీట్లో ఓ అమ్మాయి జుట్టు… సీటు వెనక్కి వచ్చి వేలాడుతూ ఉంది. ఎవరీ అమ్మాయి అనుకున్నాడు. ఆమె ఫేస్ చూడాలని సీట్లోంచీ లేచి… టాయిలెట్‌కి అంటూ అలా ముందుకు వెళ్లాడు. తిరిగి వస్తూ… అమ్మాయి ఎలా ఉందా అని చూశాడు. 21 ఏళ్ల యువతి. నిద్రపోతోంది. ఆమెను చూడగానే… అతని కన్నింగ్ మైండ్‌లో ఓ దరిద్రపు ఆలోచన పుట్టింది.

వెళ్లి తన సీట్లో కూర్చున్నాడు. చుట్టూ అందర్నీ చూశాడు. అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ఎయిర్ హోస్టెస్‌లు కూడా… ప్రయాణికులతో తమ పని పూర్తవడంతో… తమ క్యాబిన్ దగ్గరకు వెళ్లి… ఇతర పనుల్లో మునిగిపోయారు. ఇదే సరైన సమయం అనుకున్న అంకిత్ పటేల్… ఎదురుగా ఉన్న సీటు లోంచీ మెల్లిగా తన చేతిని అమ్మాయి దగ్గరకు పోనిచ్చాడు. ఏదో పాకినట్లు అనిపించడంతో… ఆమె ఉలిక్కిపడి లేచింది. ఏదైనా పురుగు పాకిందేమో అనుకొని… నడుం వైపు చూసుకుంది. అక్కడ ఏమీ లేదు. చుట్టూ చూస్తే… అంతా నిద్రపోతున్నారు. సరే అని నిద్రలోకి జారుకుంది.

కాసేపటి తర్వాత… అంకిత్ పటేల్… మళ్లీ తన చేతిని ఆమె సీటులో సందుల్లోంచీ… ఆమె నడుం దగ్గరకు పోనిచ్చాడు. మళ్లీ ఉలిక్కిపడి లేచింది. తన నడుంవైపు చూసుకుంది. అక్కడ ఏమీ లేదు. సీటును చూస్తే… ఆ సీటుకు చివర… చిన్న సైజు కన్నం ఉన్నట్లు కనిపించింది. చుట్టూ చూసింది. అంతా నిద్రపోతున్నారు. ఈసారి వెనక్కి కూడా చూసింది. వెనక అంకిత్ పటేల్ గాఢ నిద్రలో ఉన్నాడు. (నటిస్తున్నాడు). మరేంటి ఏదో పాకినట్లు అనిపించిందే… అనుకుంది. జాగ్రత్తగా ఉండాలి… నిద్రపోకూడదు అనుకుంటూనే నిద్రలోకి వెళ్లిపోయింది.

ఈసారి అంకిత్ పటేల్… ఆమె నిద్రలోకి వెళ్లిందో లేదో చూశాడు. చక్కగా నిద్రపోతోంది. మళ్లీ అదే పని చేశాడు. ఈసారి ఆమెకు మెలకువ వచ్చినా… రానట్లు నటించింది. అది పురుగో, పుట్రో కాదని ఆమె గ్రహించింది. ఆధారాలతో సహా నిరూపించాలనుకుంది. ఏం జరుగుతుందో చూద్దామని అలా ఊరుకుంది. అంకిత్ పటేల్… తన చేతిని ఆమె నడుం చుట్టూ పోనిచ్చాడు. అలా అలా చెయ్యిని పైకి పోనిస్తుంటే… ఒక్కసారిగా ఆ చేతిని పట్టుకొని… రాస్కేల్ అంటూ తన సీట్లోంచీ లేచింది. అంతే… ఆమె అరుపుకి చుట్టూ నిద్రపోతున్నవారంతా సడెన్‌గా లేచారు. ఏమైందని అడిగారు. జరిగిన దారుణాన్ని చెప్పింది. అంతా అతన్ని తిట్టిపోశారు. ఫ్లైట్ దిగగానే అతనిపై కంప్లైంట్ ఇవ్వమన్నారు.

ముంబైలో విమానం ల్యాండ్ అయ్యీ అవ్వగానే… వేగంగా వెళ్లి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది బాధితురాలు. ఐతే… అప్పటికే అంకిత్ పటేల్ అక్కడ కనిపించకుండా తప్పించుకోవాలని చూశాడు. బట్… ముంబై పోలీసులకు విషయం తెలియడంతో… మొత్తం ఎయిర్‌పోర్ట్‌ను అలెర్ట్ చేశారు. ఓ మూల నక్కిన అకింత్ పటేల్‌ను అరెస్టు చేశారు.

రువాండాలో చదువుకుంటున్న బాధితురాలు… గుజరాత్‌లోని తమ కుటుంబ సభ్యుల్ని కలిసేందుకు ఇండియా వచ్చినట్లు తెలిసింది. సో… ఫ్లైట్‌లోగానీ… రైళ్లు, బస్సులు, సినిమా హాళ్లు ఇలా ఎక్కడైనా సరే… అమ్మాయిలు అప్రమత్తంగా ఉంటే… ఇలాంటి దుర్మార్గుల ఆటలు సాగవు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *