వివేకా హత్య కేసు – తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు

వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాఫ్తును సీబీఐకి అప్పగించాలని దాఖలైన పిటిషన్లపై సోమవారం హైకోర్టులో విచారణ ముగిసింది. అనంతరం తీర్పును జడ్జి రిజర్వ్లో ఉంచారు. కేసు విచారణలో భాగంగా శవపరీక్ష నివేదికను – జనరల్ కేసు డైరీని పోలీసులు న్యాయస్థానానికి సమర్పించారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు వైయస్ జగన్ మోహన్ రెడ్డి చిన్నాన్న వివేకా హత్య సంచలనం రేపిన విషయం తెలిసిందే.
జగన్ ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలో ఈ కేసును సీబీఐకి అప్పగించాలని పిటిషన్ దాఖలు చేశారు. దీనిని వెనక్కి తీసుకునేందుకు మెమో దాఖలు చేశారు. జగన్ మెమో పిటిషన్ పై వివేకా కూతురు సునీత తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు.

టీడీపీ ప్రభుత్వం ఈ కేసును నీరుగార్చే అవకాశముందని కాబట్టి సీబీఐ విచారణ అవసరమని నాడు జగన్ హైకోర్టుకు తెలిపారని – కర్నూలులో ఓ కేసును సీబీఐకి ఇస్తామని ప్రకటన చేశారని – మరి వివేకా హత్య కేసులో అభ్యంతరం ఏమిటో చెప్పాలని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.
మరోవైపు సీబీఐకి అప్పగించాలనే పిటిషన్ ఉపసంహరణపై జగన్ తరఫు లాయర్ వాదనలు వినిపించారు. వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ ఎందుకు అవసరం లేదో – దానికి గల కారణాలు ఏమిటో న్యాయమూర్తికి అడ్వోకేట్ జనరల్ వినిపించారు. ఇరువైపుల వాదనలు విన్న అనంతరం న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ లో ఉంచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *