వైసీపీలోకి 10మంది టీడీపీ ఎమ్మెల్యేలు.. మంత్రి పెద్దిరెడ్డి సంచలనం

వైసీపీలోకి 10మంది టీడీపీ ఎమ్మెల్యేలు.. మంత్రి పెద్దిరెడ్డి సంచల వాక్యాలు చేశారు.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష టీడీపీ మీద మరో బాంబు వేశారు మంత్రి పెద్దిరెడ్డి .  పది మంది ఎమ్మెల్యేలు టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చేయడానికి సిద్ధంగా ఉన్నారని సంచలన విషయాన్ని బయటపెట్టారు. చంద్రబాబు ప్రతిపక్ష హోదా దక్కకుండా పోతుందన్నారు. మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యలతో టీడీపీలో దుమారం రేగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీ నుంచి వలసలు పెరుగుతున్నాయి. మాజీ మంత్రులే కాకుండా, ప్రస్తుత ఎమ్మెల్యే కరణం బలరాం కూడా జగన్‌కు జై కొట్టారు. అధికారికంగా కరణం బలరాం వైసీపీలో చేరకపోయినా టీడీపీకి మాత్రం దూరం అయ్యారు.

ఇప్పటికే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గిరి టీడీపీకి దూరంగా జరిగారు. కరణం కూడా అదేబాటలో నడవడంతో ఆ సంఖ్య మూడుకు చేరింది. అదే సమయంలో ముగ్గురు ఎమ్మెల్సీలు కూడా వైసీపీ వైపు అడుగులు వేశారు. ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్సీలు డొక్కా మాణిక్యవరప్రసాద్, పోతుల సునీత వైసీపీకి జై కొట్టారు. తాజాగా కర్నూలు జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ కూడా టీడీపీకి రాజీనామా చేశారు. ఆయన త్వరలో తన రాజకీయ కార్యాచరణ ప్రకటించనున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కేఈ ప్రభాకర్ వైసీపీలో చేరే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయనే ప్రచారం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *