వైసీపీ ప్లాన్… టీడీపీలో టెన్షన్..

టీడీపీని నుంచి సాధ్యమైనంత ఎక్కువమంది ఎమ్మెల్యేలను ఆకర్షించడం ద్వారా చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలని భావిస్తున్న వైసీపీ… ఇందుకోసం పలువురు ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వైసీపీ ఆకర్షించబోయే ఆ ఇద్దరు ఎమ్మెల్యే, మాజీమంత్రి ప్రకాశం జిల్లా వారే అనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ప్రకాశం జిల్లాకు చెందిన కరణం బలరాం టీడీపీకి హ్యాండ్ ఇచ్చేశారు.

అయితే ప్రకాశంలో టీడీపీకి మరో ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో పార్టీ మారాలని భావిస్తున్న ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు జిల్లాకు చెందిన మాజీమంత్రి శిద్దా రాఘవరావు ఇటీవల తాను పార్టీ మారడం లేదని క్లారిటీ ఇవ్వడంతో… వైసీపీలోకి వెళ్లే వాళ్లు ఎవరనే దానిపై సస్పెన్స్ నెలకొంది. మొత్తానికి వైసీపీ ప్లాన్‌తో టీడీపీతో ఆందోళన బాగానే పెరుగుతున్నట్టు కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *