*శారదా పీఠం వార్షికోత్సావాల్లో సీఎం వైఎస్ జగన్*

 

విశాఖ శ్రీ శారదా పీఠం వార్షికోత్సావాలకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. సోమవారం శారద పీఠం చేరుకున్న సీఎం వైఎస్‌ జగన్‌కు వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. దాదాపు రెండు గంటల పాటు వార్షిక మహోత్సవ ముగింపు కార్యక్రమంలో సీఎం జగన్‌ పాల్గొంటారు. పీఠాధిపతులు స్వామి స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్రలతో కలిసి శారదా పీఠం ప్రాంగణంలోని రాజశ్యామల అమ్మవారికి ముఖ్యమంత్రి పూజల చేశారు. ఆగమ యాగశాలలో ఐదు రోజులుగా జరుగుతున్న శ్రీనివాస చతుర్వేద హవనం, విశ్వశాంతి హోమాలను సీఎం సందర్శించారు. సీఎం వైఎస్‌ జగన్‌తోపాటు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈ కార్యాక్రమంలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *