శృతి క్రేజే తగ్గిందా??

శృతి హాసన్ కెరీర్ ఆరంభంలో ఫ్లాపులను ఎదుర్కొంది కానీ ‘గబ్బర్ సింగ్’ తో ఒక్కసారిగా దశ తిరిగి స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ‘రేసుగుర్రం’.. ‘శ్రీమంతుడు’ లాంటి సినిమాలతో ఒక వెలుగు వెలిగింది. అయితే కెరీర్ సాఫీగా జరుగుతున్న సమయంలో ప్రియుడు మైఖేల్ కోర్సలే తో ప్రేమాయణం.. లండన్ లో సింగర్ గా కెరీర్ కోసం ప్రయత్నం చేయడంతో టాలీవుడ్ సినిమాలకు దూరమైంది. ఆ సమయంలో శృతి నటించిన సినిమాలు కూడా ఫ్లాప్ కావడంతో శృతి క్రేజ్ కూడా తగ్గిపోయింది.

అయితే కోర్సలేతో ప్రేమాయణం అనుకున్నట్టుగా సాగకపోవడంతో బ్రేకప్ చెప్పేసి ఇండియాకు వచ్చేసింది. రీఎంట్రీ ఇస్తోంది. తమిళంలో విజయ్ సేతుపతి సినిమా ‘లాబం’ లో నటిస్తోంది. తెలుగులో రవితేజ-గోపిచంద్ మలినేని సినిమా ‘క్రాక్’ లో కూడా హీరోయిన్ ఆఫర్ వచ్చింది. అయితే శృతికి గతంలో మాదిరిగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు మాత్రం రావడం లేదు. ఇక క్రేజీ ప్రాజెక్టులలో కూడా శృతి హాసన్ పేరును పరిశీలించడం లేదనే టాక్ వినిపిస్తోంది.

టాలీవుడ్ వరకూ చూసుకుంటే శృతి హాసన్ దాదాపు గా ఫేడ్ అవుట్ అయినట్టేననే కామెంట్ వినిపిస్తోంది. రవితేజ సినిమా తప్ప మరో ఆఫర్ లేదు. ఇక రవితేజ ‘క్రాక్’ కూడా క్రేజీ ప్రాజెక్ట్ కాదు. గతంలో ప్రతి సినిమా మినిమం గ్యారెంటీ అన్నట్టుగా ఉండే రవితేజ సినిమాలు ఇప్పుడు కనీసం డీసెంట్ ఓపెనింగ్ కలెక్షన్స్ సాధించలేక చతికిల పడుతున్నాయి. మరి ఈ సినిమా రవితేజ మార్కెట్ స్టామినాకే పరీక్ష కానుంది. ఈ సినిమా విజయం సాధిస్తే సరే కానీ అటూ ఇటూ అయితే మాత్రం శృతి కెరీర్ కు ఫుల్ స్టాప్ తప్పదని అంటున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *