సచివాలయం పై ఓ క్లారిటీకి వచ్చిన జగన్

అధికార వికేంద్రీకరణలో భాగంగా విశాఖపట్టణానికి కార్య నిర్వాహక రాజధానిని చేయాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. ఆ మేరకు రాజధానిని విశాఖకు తరలించేందుకు చర్యలు మొదలయ్యాయి. ఆ తరలింపు ప్రక్రియపై జగన్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. ప్రస్తుతం అమరావతిలోని తన నివాసంలో ఈ విషయమై అధికారులతో పాటు మంత్రులు ఎమ్మెల్యేలతో సమావేశమై చర్చిస్తున్నారు. తరలింపు ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఈ క్రమంలో విశాఖపట్టణంలో సచివాలయం ఎక్కడ అనే దానిపై సర్వత్ర చర్చ సాగుతోంది. సచివాలయం నిర్మాణం కోసం ఎప్పటి నుంచో అన్వేషణ సాగుతోంది. సచివాలయం కోసం మంత్రులు ఎంపీలు అధికారులు విశాఖ పట్టణంలో తిరుగుతున్నారు. ముఖ్యంగా విశాఖ పట్టణం శివారు ప్రాంతాలను పరిశీలిస్తున్నారు.

తాజాగా విఖాపట్టణం మధుర వాడలోని మిలీనియం టవర్స్‌కు చేరువలో ఉన్న కాపులుప్పాడ కొండపై సచివాలయం నిర్మాణం చేయాలని పరిశీలిస్తున్నారట. అక్కడే సచివాలయం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. అంతకుముందు మిలీనియం టవర్స్‌లో సచివాలయం ఏర్పాటుకు మొగ్గు చూపగా పలువురి నుంచి వ్యతిరేకత రావడం తో దాని పై వెనక్కి తగ్గారంట. ఆ క్రమంలో ప్రత్యామ్నాయం చూస్తుండగా కాపులుప్పాడ కొండ వీరి దృష్టి లో పడింది.

మిలీనియం టవర్స్‌కు సమీపం లో ఉన్న కాపులుప్పాడ కొండ పై పరిశీలించగా అక్కడ ఐటీ సంస్థల కోసం గత ప్రభుత్వం ఐటీ లే అవుట్‌ను రూపొందించినట్లు గుర్తించారు. డేటా పార్క్ ఏర్పాటుకు అదానీ సంస్థ ముందుకు రాగా అయితే పెట్టుబడి విషయం లో స్పష్టత రాలేదని తెలుస్తోంది. రూ.70 వేల కోట్లు కాదు.. రూ.3 వేల కోట్లు పెట్టుబడి పెడుతామని అదానీ సంస్థ స్పష్టం చేయడం తో ఆ సంస్థకు మరోచోట స్థలం కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఆ స్థంలో సచివాలయ ఏర్పాటుకు అనుకూలంగా ఉంటుందని ప్రభుత్వ అధికారులతో పాటు మంత్రులు భావిస్తున్నారు. కాపులుప్పాడ కొండ మొత్తాన్ని సచివాలయం రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి వినియోగించాలనే ఆలోచన లో ఉన్నారు. ప్రస్తుతం 1350 ఎకరాల స్థలం అందుబాటులో ఉండగా 250 ఎకరాల విస్తీర్ణంలో లేవుట్ వేయగా 175 ఎకరాల స్థలం అందుబాటులోకి వచ్చింది. మిగతా కొండలను చదును చేస్తే 600 ఎకరాల భూమిని అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. సచివాలయం ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు అనుకూలం గా ఉంటుందని భావిస్తున్నారు. ఈ మేరకు ఇక్కడ ఖరారు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *