సమ్మర్ షికారు బంద్ చేసుకున్న అగ్ర హీరోలు

వేసవికాలం రానే వచ్చింది. సినీ ఇండస్ట్రీలోని స్టార్స్ అంతా వాళ్ళ ఫ్యామిలీస్ తో టూర్స్ ప్లాన్ చేస్తూ ఉంటారు. అమెరికా లండన్ స్విట్జర్లాండ్ ఇలా వాళ్ళకి ఇష్టమైన హాలిడే స్పాట్ లను సెలక్ట్ చేసుకొని వెళ్తుంటారు. కానీ ఈసారి మాత్రం మన టాలీవుడ్ హీరోలు ఎవ్వరు కూడా టూర్లకు వెళ్ళడానికి సంకోచిస్తున్నట్లు తెలుస్తుంది. దీనికి కారణం కరోనా ఎఫెక్ట్.

కరోనా ఎఫెక్ట్ ఇప్పుడు దేశం నలువైపులా పాకింది. సామాన్య ప్రజలలోనే కాదు స్టార్ హీరోల ఫ్యామిలీస్ లో కూడా కరోనా భయం పట్టుకుంది. ఎప్పుడూ టూర్స్ అనగానే గుర్తొచ్చే మహేష్ బాబు అల్లు అర్జున్ రాంచరణ్ లాంటి స్టార్లు తమ విహారయాత్రలను వాయిదా వేయడం గమనార్హం. రీసెంట్ గా కరోనా వైరస్ సోకి మనదేశంలో ఒకరు మృతి చెందారు. దీనితో కరోనా ఉనికి మన దేశంలో బలంగా ఉన్నట్లు భావిస్తున్నారు.

జాగ్రత్త పడక పోతే ఎంతటి స్టార్ అయినా హాస్పిటల్ దారి పట్టాల్సిందే మరి. ఈ కరోనా దెబ్బతో డార్లింగ్ ప్రభాస్ కూడా తన షూటింగ్ ని త్వరలో వాయిదా వేసి ఇండియాకి రానున్నాడట. ఇలాగే చాలామంది ఈ సమ్మర్ లో తమ విహార యాత్రలకు బై చెప్పి సొంత ఇంటికే అంకితం కానున్నారు. విచిత్రంగా ఉంది కదా.. కరోనా ఎఫెక్ట్ దేశాన్నంతా ఊపేస్తోంది. దేశం నుండే కాదు ఇంటి నుండి కూడా బయటికి వెళ్లకుండా చేస్తుంది. చూడాలి మరి మన టాలీవుడ్ స్టార్లు ఏం చేస్తారో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *