సినిమా స్టోరీని మించి ఉండే అనసూయ 10 ఏళ్ల లవ్ స్టోరీ మీకు తెలుసా?

ప్రస్తుతం బుల్లి తెర స్టార్ యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్న అనసూయ హీరోయిన్స్ స్థాయిలో అభిమానులను సొంతం చేసుకుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇద్దరు పిల్లలకు తల్లి అయినా కూడా అనసూయ ఏమాత్రం తగ్గకుండా అందాల ప్రదర్శణ చేస్తూ బుల్లి తెరపై మరియు వెండి తెరపై తన సత్తా చాటుతూ వస్తోంది. సోషల్ మీడియా సెన్షేషన్ గా పేరున్న అనసూయది ప్రేమ వివాహం. వీరి ప్రేమ పదేళ్లు సాగింది.. ప్రేమ వివాహం అయ్యి పదేళ్లు అయ్యింది. అంటే భరద్వాజ్ తో అనసూయది దాదాపుగా రెండు దశాబ్దాల ప్రేమ.

అనసూయ ప్రేమ కథ సినిమాటిక్ గా అనిపిస్తుంది. ప్రేమించుకుని పెద్దలతో పోరాడి ఒప్పించి మరీ వీరు పెళ్లి చేసుకున్నారు. అనసూయ ఇంటర్ లో ఉండగానే భరద్వాజ్ తో ప్రేమలో పడిపోయిందట. కాలేజ్ ఎన్ సీసీ క్యాంప్ కు వెళ్లిన సమయంలో అనసూయ మరియు భరద్వాజ్ లు పరిచయం అయ్యారట. ఆ సమయంలో టీం లీడర్ గా అనసూయ వ్యవహరించేది. అనసూయను ప్రేమిస్తున్నట్లుగా క్యాంప్ సమయంలోనే భరద్వాజ్ చెప్పాడట. ఆ సమయంలో మౌనంగా ఉన్న అనసూయ మరుసటి సంవత్సరం క్యాంప్ సమయంలో భరద్వాజ్ ప్రేమకు ఓకే చెప్పిందట. ప్రేమ విషయం చాలా కాలం పాటు ఇంట్లో తెలియకుండా సాగించారట.

అనసూయకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్న సమయంలో తన ప్రేమ విషయాన్ని చెప్పిందట. భరద్వాజ్ గురించి తండ్రికి చెప్పడంతో ఇంట్లో పెద్ద గొడవే అయ్యిందట. భరద్వాజ్ నచ్చక పోవడంతో అనసూయ తండ్రి పెళ్లికి ఒప్పుకోలేదు. ఆ తర్వాత కొన్నాళ్లు అనసూయ బయట హాస్టల్స్ లో ఉండేది. మళ్లీ ఇంటికి చేరిన అనసూయను తల్లిదండ్రులు మరో అబ్బాయిని పెళ్లి చేసుకునేందుకు ఒప్పించినా కూడా భరద్వాజాను మాత్రమే పెళ్లి చేసుకుంటాను లేదంటే లేదు అంటూ తెగేసి చెప్పడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఒప్పుకుని ఇద్దరికి పెళ్లి చేశారట.

అనసూయకు మంచి సంబంధంతో వివాహం చేస్తే ఆమె ఇద్దరు చెల్లెల్లకు కూడా మంచి సంబంధాలు వస్తాయనేది ఆమె తండ్రి అభిప్రాయం. అందుకే మొదట భరద్వాజాను వద్దన్నాడట. ఇప్పుడు అనసూయ తన ఇద్దరు చెల్లెల్లకు కూడా మంచిగ సెటిల్ చేసింది. భరద్వాజా బ్యాంక్ ఎంప్లాయికాగా అనసూయ రెండు చేతులా సంపాదిస్తూ ఇద్దరు కూడా చాలా సంతోషంగా జీవితాన్ని గడిపేస్తున్నారు. వీరి ప్రేమకు ఇద్దరు పిల్లలు కూడా. ప్రేమలో పదేళ్లు ఉండి పెళ్లి చేసుకున్న వీరు.. పదేళ్ల పాటు వైవాహిక జీవితాన్ని చాలా సంతోషంగా గడిపేశారు. ఇంకా ముందు ముందు కూడా వారు ఆనందకరమైన జీవితాన్ని గడపాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *