సి ఏ ఏ ను ఉపసంహరించు కోవాలని ఢిల్లీలో రోడ్డెక్కిన మహిళలు..

పౌరసత్వ సవరణ చట్టం మంటలు ఢిల్లీలో ఇంకా ఆరడం లేదు. నిన్న రాత్రికి రాత్రి ఏం జరిగిందో కానీ.. దేశ రాజధాని ఢిల్లీలోని జాఫ్రాబాద్ మెట్రో స్టేషన్ వద్దకు 1000 మంది మహిళలు అర్ధరాత్రి చేరుకొని పౌరసత్వసవరణ చట్టం (సీఏఏ) జాతీయ పౌరసత్వ జాబితా (ఎన్నార్సీ)లను నిరసిస్తూ ఆందోళనకు దిగారు. చేతిలో జాతీయ జెండాలతో ఆజాద్ అంటూ నినాదాలు చేశారు. సీఏఏను ఉపసంహరించేవరకు ఇక్కడి నుంచి కదలమంటూ ఆందోళన చేశారు. దీంతో రోడ్లు బ్లాక్ అయిపోయి ట్రాఫిక్ స్తంభించిపోయింది.

ఇప్పటికే దాదాపు 2నెలలుగా సీఏఏకు వ్యతిరేకంగా ఢిల్లీలోని షాహీన్ బాగ్ లో నిరసనలు జరుగుతున్నాయి. ఇప్పుడు కొత్తగా జాఫ్రాబాద్ లోనూ మహిళలు పోటెత్తడం పోలీసులకు తలనొప్పిగా మారింది. బీజేపీ ప్రభుత్వంలో అలజడి రేపింది.

కాగా షాహీన్ బాగ్ లో అల్లర్లపై సుప్రీం కోర్పు స్పందించింది. వారితో చర్చలు జరపాలని ప్రభుత్వాన్ని కోరింది. నిరసన తెలుపడం ప్రాథమిక హక్కు అని పేర్కొంది. అయితే రోడ్లను బ్లాక్ చేయవద్దని నిరసనకారులను సూచించింది.
అయితే ప్రభుత్వం పట్టించుకోకపోవంతో తాజాగా జాఫ్రాబాద్ లో నిరసనలకు ఆందోళనకారులు దిగారు. సీఏఏని రద్దు చేసే వరకు కదలమని భీష్మించుకు కూర్చున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *