సీస్ నీలం సాహ్ని తో జర్మనీ కౌన్సల్ జనరల్ భేటీ

చెన్నెలోని కౌన్సలేట్ జనరల్ ఆఫ్ ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీకి చెందిన కౌన్సల్ జనరల్ కేరిన్ స్టోల్(Karin Stoll)సోమవారం అమరావతి సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నితో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ప్రాథమిక రంగంలో(Priority Sector)జర్మనీ దేశం తరుపున వివిధ కంపెనీలు పెట్టుబడులు పెట్టే అంశంపై ఆమె సిఎస్ తో చర్చించారు.

విద్యా, సాంస్కృతిక మరియు పర్యాటక రంగాలతోపాటు ఆంధ్రప్రదేశ్ లో పనిచేస్తున్న జర్మనీ కంపెనీలకు సంబంధించిన వివిధ ద్వైపాక్షిక సహకార అంశాలపై సమావేశంలో చర్చించారు.

ఈసమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యా,వైద్య రంగాల్లో మెరుగైన మౌళిక సదుపాయల కల్పనకు ముఖ్యమంత్రి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారని ఆమె జర్మన్ కౌన్సల్ జనరల్ కేరిన్ స్టోల్ దృష్టికి తెచ్చారు.

ఈ కార్యక్రమంలో హైదరాబాద్ లోని ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ హానరరీ కౌన్సల్ బివిఆర్ మోహన్ రెడ్డి, రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.ఎస్.రావత్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *