సూపర్ స్టార్ కోసం నయన్ ఓ మెట్టు దిగిందా?

నయనతార సౌత్ లోనే టాప్ హీరోయిన్. దక్షిణాదిన భారీ పారితోషికం తీసుకునే హీరోయిన్ నయన్ ఒక్కరే. ఒక్కో సినిమాకు 5.5 కోట్లు ఛార్జ్ చేస్తుంది. అందులో రూపాయి తగ్గినా నో అంటుంది. నిర్మాత ముక్కు పిండి మరీ వసూలు చేస్తుంది. ఖరీదైన స్టార్ హోటల్…ప్లైట్..ఇతర సౌకర్యాలు తప్పని సరి. కేవలం సినిమా కావాల్సిన కాల్షీట్లు మాత్రమే కేటాయిస్తుంది. ఎక్స్ ట్రా ఒక్కరోజు కూడా ఇవ్వదు. ఇక సినిమా ప్రచారానికి ఎలాగూ హాజరు కాదన్నది తెలిసిందే. సూపర్ స్టార్ రజనీకాంత్ తో ఇటీవలే దర్బార్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

ఈసినిమా కోసం అక్షరాలా 5.5 కోట్లు తీసుకుంది. నిజానికి ఇందులో అమ్మడి పాత్ర చిన్నదే అయినప్పటికీ నిర్మాణ సంస్థ లైకా బేరమాడనే ప్రయత్నం చేసింది…ఇష్టమైతే బెక్ చేసుకోండి. కష్టమైతే మానేయండని ముఖం మీదనే చెప్పేసింది. దీంతో అవసంర లైకాది కాబట్టి అమ్మడు అడిగిన మొత్తం ఇచ్చి అగ్రిమెంట్ చేసుకున్నారు. ఇక అమ్మడు మరోసారి సూపర్ స్టార్ తో జోడీ కట్టబోతున్న సంగతి తెలిసిందే. శివ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమా టైటిల్ అన్నాతై ( తెలుగులో అన్నయ్య) .ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది.

అయితే ఈ సినిమా కు మాత్రం తన పారితోషికం నుంచి కోటి రూపాయలు మినహాయింపు ఇచ్చిందిట. 5.5కోట్లు తీసుకుంటాను.. కానీ సన్ కావడం… రెండవసారి రజనీ సరసన ఛాన్స్ కావడంతో కోటి తగ్గించి ఈ సారికి ఇలా కానిచ్చేద్దామని చెప్పిందిట. దీంతో సదరు నిర్మాణ సంస్థ వెంటనే అమ్మడితో అగ్రిమెంట్ చేసుకుందిట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *