సేమ్ స్క్రిప్ట్ బాబు

వైసీపీ అదినేత – ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై నెట్టింట హాట్ చర్చ జరుగుతోంది. ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడుతో ముడిపెట్టి సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్లో ఒకదాంతో…నెట్లో ఓ రేంజ్ లో ట్రోలింగ్ జరుగుతోంది. ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి పథంలో నడిపించే క్రమంలో…నాడు-నేడు అనే కార్యక్రమం ప్రవేశపెట్టారు సీఎం జగన్. అయితే ఇది రాజకీయాలకు సైతం అమలు చేస్తున్నారట. విశాఖ ఎయిర్ పోర్టులో 2017లో అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఎదురైన అనుభవం ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబుకు ఎదురైన నేపథ్యంలో ఈ చర్చ హాట్ టాపిక్ గా మారింది.

గతంలో జరిగిన విషయానికి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైసీపీ 2017లో జనవరి 26న క్యాండిల్ ర్యాలీ నిర్వహణకు సిద్ధమైంది. అయితే అదే సమయంలో విశాఖలో సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ జరుగుతుండడం.. ఆ సమ్మిట్ కు దేశ – విదేశాల నుంచి కంపెనీల ప్రతినిధులు తరలిరావడంతో.. క్యాండిల్ ర్యాలీకి అనుమతి ఇవ్వలేమని స్పష్టం చేసింది. మరోవైపు ఇందులో పాల్గొనేందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖ చేరుకున్నారు. అయితే వైఎస్ జగన్ బృందాన్ని ఎయిర్ పోర్టులోనే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రన్ వే పైనే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.

ఇక తాజా పరిణామం విషయానికి వస్తే…టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఈ రోజు ఉత్తరాంధ్రలో ప్రజా చైతన్య యాత్ర తలపెట్టారు. అయితే ఆయన్ను ఎయిర్పోర్టులోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నాయి. చంద్రబాబు కాన్వాయ్ ను ముందుకు కదలనివ్వకుండా అడ్డుకున్నారు. విశాఖ ఎయిర్ పోర్టులోనే రసాభాసగా మారింది. ఈ ఘటనలను గమనించిన వారు నాడు నేడు అనే కార్యక్రమం పాఠశాలలకే కాదు రాజకీయాలకు వర్తిస్తుందని సెటైర్లు వేసుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *