సౌత్ ఇండియా నిర్మాతలకు నో చొప్పిన శ్రద్దా

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్దా కపూర్ తెలుగులో ‘సాహో’ చిత్రంలో నటించిన విషయం తెల్సిందే. ఆ సినిమా తర్వాత సౌత్ లో ఈ అమ్మడికి పలు చిత్రాల్లో ఆఫర్లు వచ్చాయి. కాని ఈ అమ్మడు మాత్రం వాటన్నింటికి నో చెబుతూ వచ్చింది. ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్ లో వరుసగా చిత్రాలు చేస్తోంది. హిందీలో స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు వస్తున్న ఈ సమయంలో సౌత్ సినిమాలపై ఆసక్తి చూపడం లేదు.

ఇటీవల ప్రముఖ నిర్మాత స్టార్ హీరో సినిమాకు గాను ఈ అమ్మడిని సంప్రదించారట. బాలీవుడ్ లో ఇచ్చేంత పారితోషికం ఇస్తామంటూ ఆఫర్ చేసినా కూడా ఈమె మాత్రం నో చెప్పిందని తెలుస్తోంది. సౌత్ నిర్మాతలు ఆమెను సంప్రదించేందుకు ప్రయత్నించినా కూడా మొహం చాటేస్తుందట. ఏదోలా ఆమెను కొందరు నిర్మాతలు కలిస్తే వారికి ఏదో కారణం చెప్పి నో చెబుతుందట. వరుసగా బాలీవుడ్ చిత్రాలు చేస్తున్న ఈ అమ్మడు ప్రస్తుతానికి సౌత్ పై అస్సలు ఆసక్తి చూపడం లేదు.

బాలీవుడ్ లో క్రేజ్ తగ్గినప్పుడైనా ఈ అమ్మడు మళ్లీ తెలుగులో నటిస్తుందేమో చూడాలి. తెలుగులో ఈమె ఒక్క సినిమాలోనే నటించినా కూడా మంచి గుర్తింపు దక్కించుకుంది. సౌత్ సినిమాలకు సరిగ్గా సెట్ అయ్యే ఫీచర్స్ ఈ అమ్మడిలో ఉన్నాయంటూ చాలా మంది అనుకుంటూ ఉంటారు. అందుకే ఈ అమ్మడిని మన సినిమాల్లో నటింపజేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కాని ఆమె మాత్రం మన నిర్మాతలకు మొహం చాటేస్తోంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *