స్టైలిష్ గెటప్ తో .. గ్లామర్ గేర్ వేసిన: శృతి హాసన్

స్టార్ కిడ్ గా ఫిలిం ఇండస్ట్రీకి పరిచయం అయిన శృతి హాసన్ మొదట్లో ఫెయిల్యూర్లు ఎదుర్కొంది కానీ ‘గబ్బర్ సింగ్’ తో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. కొంతకాలం కెరీర్ బాగానే కొనసాగినప్పటికీ మైఖేల్ కోర్సలే తో ప్రేమాయణం.. ఇంగ్లీష్ సింగర్ గా కెరీర్ మొదలు పెట్టడం లాంటి వాటితో నటన కాస్తా అటకెక్కింది. అయితే అటు కోర్సలే తో బ్రేకప్పు.. సింగింగ్ కెరీర్ లో అనుకున్నంత విజయం సాధించలేకపోవడంతో మళ్లీ హీరోయిన్ గా రీ-ఎంట్రీ ఇస్తోంది.

ఇప్పటికే తమిళంలో విజయ్ సేతుపతి సినిమా ‘లాబం’ లో హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగులో మాస్ మహారాజా రవితేజ ‘క్రాక్’ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలు తప్ప మరే ఇతర ఆఫర్లు లేవు. కొత్త ఆఫర్ల కోసం ఈమధ్య శృతి హాటు రూటును ఎంచుకుందనే టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే శృతి ఈమధ్య హాటు ఫోటో షూట్లు చేస్తూ ఆ ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేస్తోంది. తాజాగా శృతి షేర్ చేసిన ఫోటోలు అలాంటివే.

సింగిల్ పీస్ లా కనిపించే ఓ వెరైటీ ప్యాంట్ షర్టు ధరించి.. భారీ వీ-నెక్ తో గ్లామర్ గేర్ వేసేసింది. పర్ఫెక్ట్ మేకప్ తో సూపర్ స్టైలింగ్ తో నేను ఉన్నాను… నన్ను గుర్తించండి.. అన్నట్టుగా పోజులిచ్చింది. మరి శృతి స్లిమ్ అవతారం.. స్టైలిష్ గెటప్.. గ్లామర్ గేర్ చూస్తుంటే ఫిలిం మేకర్లకు హాట్ వైఫై సిగ్నల్స్ ఇస్తూ ఉన్నట్టే. మరి ఈ సిగ్నల్స్ ను దర్శకనిర్మాతలు గుర్తిస్తున్నారో లేదో.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *